'Kajal Kartika' streaming on Aha on the occasion of UGADI through Hanuman Media from April 9th

 కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలో నటించిన 'కాజల్ కార్తిక' మూవీ హనుమాన్ మీడియా ద్వారా ఉగాది శుభాకాంక్షలతో రేపటి నుంచి ఆహా లో స్ట్రీమింగ్



కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో దీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక. థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమా లో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. ఎన్. మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ఆహా ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అవుతోంది. కామెడీ, హర్రర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. కామెడీ, హర్రర్ లవర్స్ ఏప్రిల్ 9న ఆహా లో ఈ సినిమా చూసేయండి.


ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రిప్పింగ్ గా అనిపించింది. 5 వేర్వేరు కథలతో కాజల్ కి రెజీనాకి సంబంధం ఏంటి? ఊరు వాళ్ళందరూ కాజల్ని కొట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? కామెడీ ఉంటునే హర్రర్ ఇంపాక్ట్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా పైన అంచనాలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఒక మంచి కామెడీ హర్రర్ ఫిలిం కోసం ఎదురుచూసే వాళ్ళకి ఏప్రిల్ 9న 'కాజల్ కార్తీక' హనుమాన్ మీడియా ద్వారా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది చూసేయండి.


Post a Comment

Previous Post Next Post