Home » » S99 Prequel and sequel in progress-CJagan Mohan

S99 Prequel and sequel in progress-CJagan Mohan

 ఇండియన్ సినీ రంగంలో మొదటిసారిగా ఒక సినిమాకి ప్రీక్వెల్, సీక్వెల్ తీస్తున్నాను: ఏస్ 99 దర్శకుడు C జగన్మోహన్టెంపుల్‌ మీడియా - ఫైర్‌బాల్‌ ప్రో సంయుక్త నిర్మాణంలో సి. జగన్‌మోహన్‌ ప్రధానపాత్రను పోషిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్‌`99’. ఈ చిత్రానికి నిర్మాతలు యతీష్‌`నందిని. ఈ చిత్రం మార్చి 1వ తేదీన  విడుదలైంది. కాగా మొదటి వారం కంప్లీట్ చేసుకుని రెండో వారంలో  అడుగెడుతున్న శుభసందర్భంలో చిత్ర హీరో కం డైరెక్టర్ జగన్ మోహన్ మీడియా తో ముచ్చటించారు.

 

మా ఎస్ 99 సినిమా నీ  చూసినవారంతా బాగుంది అని చెప్తూ తమ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ లకు చెప్పడం వలన రెండవారం కూడా చాలా థియేటర్స్ లో కంటిన్యూ అవుతుంది...


నేను చాల రోజులనుండి మీడియా బిజినెస్ లో ఉండడం వలన మరియు చిన్నప్పుడు స్టేజ్ నాటకాలు వేయడం వలన సినిమా కధలమిద ఇంటరెస్ట్ పెరిగినా ఉన్న వ్యపారాల వలన టైం కుదరలేదు..


కాని లాక్ డౌన్ టైం లో బిజినెస్ తగ్గి చాలా ఫ్రీ టైం దొరకం వలన సినిమా కథలు వ్రాసుకోవడం మొదలు పెట్టాను. అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ ఎస్ 99 సినిమా కధ.


మొత్తంగా కధ తయారైన తర్వాత మా వెల్ విషర్స్ తో చెప్పినప్పుడు చాలా బాగుంది మీరే ఎందుకు దర్శకత్వం చెయ్యకూడదు అని పట్టుబట్టడం వలన దర్శకత్వం చేద్దామని నిర్ణయం తీసుకొని నటుల కోసం చాలా తిరిగాను.


ఈ కథకు లీడ్ పాత్ర ధారి సినిమా మొత్తం గుండుతో నటించాలి..


చాలామంది నటులు ఒప్పుకోక పోవడం తో మా టీం నన్నే చేయమని చెప్పడం తో నేను కూడా కొన్ని సీన్స్ నటించి బిగ్ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మా టీం అంతా ఓకే అనుకొన్న తర్వాత నటించాను.


ఇప్పుడూ విడుదల అయిన ఈ ఎస్ 99 సినిమా, పార్ట్ 2 అనుకొంటే దీనికి ప్రిక్వల్గా  ఏస్ 99 పార్ట్ 1 కధ రెఢీ గా ఉంది త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాను..అలానే ఈ ఎస్ 99 కి సేక్వైల్ గా ఎస్ 99 పార్ట్ 3 కూడా తీస్తాను.


కధ రాసుకున్నప్పుడే మూడు పార్ట్ లుగా తియ్యాలి అని డిసైడ్ అయ్యాను. మా ప్రొడ్యూసర్స్ కూడా యంగ్ ప్రొడ్యూసర్స్, వారు ఏస్ 99 రిజల్ట్ తో చాలా హ్యాపీ గా ఉన్నారు.


ఏస్ 99 తెలుగు మాత్రమే మొన్న విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ డబ్బింగ్ కూడా పూర్తి చేసాము. త్వరలోనే హింది లోకూడా రిలిజ్ చేస్తాను.


ఏస్ 99 సినిమా డిజిటల్ బిజినెస్ డిస్కషన్స్ లొ ఉంది. మూడు ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ తో మాట్లాడుతున్నాము..


త్వరలోనే బిజినెస్ క్లోజ్ చేసి ఓటిటి లో కూడా విడుదల చేస్తాం.


సినిమా స్టార్టింగ్ నుండీ ఇప్పటి వరకూ ఎంతగానో సహాయ పడుతున్న మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదములు..


నేనూ మీడియా బిజినెస్ లొ ఉండడం వలనా ప్రస్తుత మీడియా కూడా ఎంతో ఫ్రెండ్లీ గా సహాయ సహకారాలు అందిస్తున్నారు.


మి మీడియా సాహకారం ఇలనే కొనసాగితే సినిమా ప్రేక్షకులకు కొత్త రకమైన కథలతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న నా కల తీరుతుంది.


థాంక్యూ..

C జగన్ మోహన్.


Share this article :