Home » » Razaakar Success Meet

Razaakar Success Meet

  భావిత‌రాల భ‌విష్యత్తు కోసం తీసిన సినిమా ఇది

- ర‌జాకార్ హిస్టారిక‌ల్ హిట్ స‌క్సెస్‌మీట్‌లో నిర్మాత గూడూరు నారాయ‌ణ‌రెడ్డిబాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. మార్చి 15న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీ భాషల్లోనూ  విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ హిస్టారిక‌ల్ హిట్‌ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. హిస్టారిక‌ల్ హిట్ విజ‌యోత్స‌వాల్లో భాగంగా చిత్ర యూనిట్ అంతా కేక్ క‌ట్ చేశారు. ఈ సందర్భంగా...

ముఖ్య అతిథిగా హాజ‌రైన స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ `వృత్తిరీత్యా నేను 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు చెన్నైలో ఉన్నా. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కి మారాను. అనుకోకుండా నాకు ట్రైన్‌లో సుద్దాల అశోక్‌తేజ క‌లిశారు. ఆ జ‌ర్నీలో ఆయ‌న ర‌జాకార్ల వ‌ల్ల ప‌డ్డ తిప్ప‌ల గురించి చెప్పారు. వాళ్ల నాన్న‌గారు కూడా ర‌జాకార్ల మీద పోరాటం చేశార‌ని చెప్పారు. దేశ‌భ‌క్తులంద‌రూ మీటింగ్ పెట్టుకుంటే ర‌జాకార్లు దాడికి వ‌చ్చార‌ట‌. అప్పుడు ఎవ‌రో ఒకావిడ `ఎవ‌ర్రా.. వేయండెహే.. వేయండెహే.. అని అన్నారట‌. అప్పుడు సుద్దాల హ‌నుమంతుగారు వెయ్ వెయ్ దెబ్బ‌కు దెబ్బ‌.. `అని పాట పాడార‌ట‌. అదంతా వింటుంటే థ్రిల్లింగ్‌గా అనిపించింది. వ‌చ్చిన కొత్త‌ల్లో తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతాల‌కు వెళ్లేవాడిని. వాళ్ల అనుభ‌వాల‌ను వినేవాడిని. నిజామాబాద్‌లో ఖిల్లాకి వెళ్లాను. అక్క‌డ దాశ‌ర‌థిగారు రాసిన నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ  రాశార‌ని గుర్తుకొచ్చింది. వాట‌న్నిటి ఇన్‌స్పిరేష‌న్‌తో నేను రాజ‌న్న సినిమా చేశాను. దాంట్లో ర‌జాకార్ల తాలూకు విష‌యాన్ని ట‌చ్ చేశాను. దాన్ని పూర్తిగా ఎవ‌రైనా సినిమా చేస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. దాన్ని గూడూరు నారాయ‌ణ‌రెడ్డిగారు చేశారు. రివ్యూలు బావున్నాయి. డైర‌క్ట‌ర్‌గారి ప‌నిత‌నం బావుంద‌ని మెచ్చుకున్నారు చాలా మంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు బాగా చేశార‌ని అన్నారు. విన‌డానికి ఆనందంగా అనిపించింది` అని అన్నారు.

 గూడూరు నారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ `భావిత‌రాల భ‌విష్య‌త్తు కోసం తీసిన సినిమా ఇది. డ‌బ్బు కోసం, గ్లామ‌ర్ కోసం తీయ‌లేదు. న‌న్ను ఆదేశించింది తిరుమ‌ల తిరుప‌తి దేవుడు శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారు. వారి స‌న్నిధికి వెళ్లిన‌ప్పుడు నాకు ర‌జాకార్ అనే పేరు త‌ట్టింది. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ మెచ్చుకున్నారు. హై క్వాలిటీతో తీశామ‌ని అన్నారు. కానీ ఎందుకో, ఈ త‌రానికి గ్లామ‌ర్‌, ఇంకేమైనా ఇంట్ర‌స్ట్ ఉందా? అని అనుమానం వ‌స్తోంది. ఈ సినిమాలోని సారాంశం భావి త‌రాల భ‌విష్య‌త్తు. నైజామ్‌కి స్వాతంత్ర్యం వ‌చ్చిన సంగ‌తిని ఈ సినిమాలో చూపించాం. ఈనాడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ని గుర్తుంచుకోవాలి. ఈ సినిమా ద్వారా సందేశం ఇవ్వ‌ద‌ల‌చుకున్నా. ఈ ప్రాంతంలోగానీ, దేశంలోగానీ రజాకార్లు పుట్టొద్దు. వాళ్ల ఆలోచ‌న తీరు దుష్ట‌శ‌క్తులు ఆలోచించిన‌ట్టే ఉంటుంది. భార‌త‌దేశంలోని ఈనాటి ప్ర‌జానీకం స్వేచ్ఛ‌గా ఉండాలి. హిందువుల్లో లేజీ మెంటాలిటీ వ‌చ్చింద‌ని పెద్ద‌మ‌నిషి అన్నారు. ఈనాటి స‌మాజం దీని గురించి బాగా ఆలోచించాలి. స‌మాజానికి కావాల్సింది సందేశాత్మ‌క చిత్రం. అదే మా సినిమా. ర‌జాకార్లు అంతం కాలేదు, మ‌ళ్లీ ఆరంభ‌ద‌శ‌లో ఉన్నార‌న్న విష‌యాన్ని దృష్టిలో  పెట్టుకుని, అంద‌రూ ఐక‌మ‌త్యంతో మెల‌గాలి` అని అన్నారు.

శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ `ర‌జాకార్ గురించి మాట్లాడాలంటే గూడూరి నారాయ‌ణ‌రెడ్డిగారు గురించి మాట్లాడాలి. ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. ప్ర‌తి ఎపిసోడ్‌నీ హైలైట్‌గా తీశారు. బెస్ట్ సినిమా ఇది. తెలంగాణ గురించి ఇంత బాగా తీశారు. నేను తెలంగాణ‌లోనే పుట్టా. ఈ ప్రాంతంలో ఇంత చ‌రిత్ర ఉంద‌ని మాకు తెలియ‌దు. పూర్వీకులు ఇంత క‌ష్ట‌ప‌డ్డారా? అని తెలుసుకున్నాను. థియేట‌ర్ల‌లో చూడాల్సిన సినిమా ఇది. అంత చ‌రిత్ర‌గ‌ల సినిమా ఇది. భావిత‌రాల‌కు ఈ సినిమా గురించి తెలియాలి` అని అన్నారు.

మ‌హేష్ ఆచంట మాట్లాడుతూ `డైర‌క్ట‌ర్‌కి చాలా థాంక్స్. ఆయ‌న చెప్పిన‌ప్పుడే నాకు అనిపించింది. పెద్ద హిట్ అవుతుందని. ఈ సినిమా కోసం నాతో మీసం తీయించారు. ఇది చాలా వెరైటీగా అనిపించింది. ఇంత మంచి చ‌రిత్ర‌లో నాకు అవ‌కాశం క‌ల్పించినందుకు ఆనందంగా ఉంది` అని అన్నారు.

ఇంద్ర‌జ మాట్లాడుతూ `ఈ సినిమా విడుద‌ల అయ్యేదాకా డైర‌క్ట‌ర్‌, నిర్మాత చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు. థ్రెటెనింగ్ కాల్స్, మెసేజ్‌ల దాకా చాలా ఎదుర్కొన్నారు. ప్రేక్ష‌కులను థియేట‌ర్‌కి రాకుండా చేయ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా సినిమా స‌క్సెస్ అయింది. సినిమా నిజ‌మైన విజ‌యం ఎప్పుడంటే పాతికేళ్ల త‌ర్వాత కూడా ఏదో ఒక విష‌యాన్ని తెలుసుకోవాల‌ని దాన్ని మ‌ళ్లీ చూసిన‌ప్పుడే. మా సినిమా ర‌జాకార్ ను...  పాతికేళ్ల త‌ర్వాత కూడా ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ‌గా ప్రేక్ష‌కులు చూస్తార‌నే న‌మ్మ‌కం మాకు ఉంది. ఈ సినిమాలో చూపించింది ఏదీ క‌ల్పితం కాదు. ఒక మ‌తానికో, ఓ పార్టీకో సంబంధించి ఆర్టిఫిషియ‌ల్‌గా చేయ‌లేదు మేం. డైర‌క్ట‌ర్‌గారు చెప్పిన‌దాన్ని గుండె నిబ్బ‌రంతో ప్రొడ్యూస‌ర్‌గారు తీశారు. ఈ సినిమా ఓ పాఠం లాంటిది. చాక‌లి ఐల‌మ్మ‌గా నా కెరీర్‌లో మంచి పాత్ర ఇది` అని అన్నారు.

భీమ్స్ మాట్లాడుతూ `చేగువేరా, మావో, లెనిన్ గురించి పుస్త‌కాల్లో చ‌దువుకుంటున్నాం. కానీ, మ‌న చ‌రిత్ర‌ను మ‌ర్చిపోయాం. దాన్ని మ‌ర్చిపోకుండా దీన్ని తీశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు, సినిమాటోగ్ర‌ఫీ మంత్రులు స‌పోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ సినిమాకు అంద‌రూ ఇచ్చే స‌పోర్ట్ మోదీగారి వ‌ద్ద‌కు చేరాలి. హైద‌రాబాద్ విమోచ‌నం ఎలా జ‌రిగిందో, భ‌విష్య‌త్తు త‌రాల‌కు తెలియ‌జేయాల‌ని కోరుతున్నా. థియేట‌ర్‌కి ప్ర‌జ‌లు రావాలి. అది ఆవేశంతో కాదు, ఆలోచ‌న‌తో చెబుతున్నా. మ‌న పెద్ద‌ల త్యాగాల‌ను గుర్తించి థియేట‌ర్‌కి రావాలి. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రులు గ‌ర్వ‌ప‌డాలంటే ఈ సినిమా అంద‌రూ చూడాలి` అని అన్నారు.

యాటా స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ `మా సినిమాకు మీడియా చాలా స‌పోర్ట్ చేసింది. భీమ్స్ ప్రాణం పెట్టి ప‌నిచేశాడు. ప్ర‌తి పాటా ఆర్థ్ర‌త‌తో చేశాడు. టెక్నీషియ‌న్లంద‌రూ అలాగే ప‌నిచేశారు. న‌టీన‌టులంద‌రూ బాగా చేశారు. ఈ సినిమా కోస‌మే దేవుడు వీళ్ల‌ని పుట్టించారేమో అనిపిస్తుంది. ఈ సినిమా కోసం నేను ప‌డ్డ క‌ష్టం త‌క్కువ‌. వాళ్లు ప‌డ్డ క‌ష్ట‌మే ఎక్కువ‌. ఆర్టిస్ట్ మ‌హేష్... ప్ర‌భాస్ - మారుతి సినిమా కోసం ప‌నిచేయాలి. అయినా నా కోసం మీసాలు తీసేశారు. ఆయ‌లాగానే... ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. మా సినిమా మ‌త చ‌రిత్ర కాదు. కేవ‌లం గ‌త చ‌రిత్ర‌. అన‌వ‌స‌రంగా ఓ మతంలోకి న‌న్ను లాగొద్దు అని అన్నాను. నా ఫ్యామిలీలో ఆ మ‌తం ఉంది. నేను ఈ పార్టీలో లేను. అందుకే ద‌య‌చేసి న‌న్ను లాగొద్దు. స‌ముద్ర‌మంత చ‌రిత్ర‌లో నేను చంచా నీటిని మాత్రమే ఈ సినిమాలో చూపించాను. చ‌రిత్ర‌లో దీన్ని తొక్కేయ‌లేరు. మేం ఆరేడు జిల్లాలు తిరిగాం. అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుతున్నారు. ఎవ‌రూ చెడుగా మాట్లాడ‌లేదు. అంద‌రూ మా సినిమాను ఆద‌రిస్తున్నారు. ఈ సినిమాను నేను చేయ‌డానికి నిర్మాత‌కు, నాకూ అనుసంధానంగా ఉన్న‌ది అంజిరెడ్డిగారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌. చాలా బాగా ఈ సినిమాను తీశారు. నీట్‌గా ప్రాజెక్ట్ జ‌ర‌గ‌డానికి స‌హ‌క‌రించారు. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌లువురు పాల్గొన్నారు.Share this article :