Home » » Rang Rang Rangeela Song Out From Paarijatha Parvam

Rang Rang Rangeela Song Out From Paarijatha Parvam

 చైతన్య రావు, శ్రద్ధా దాస్, సంతోష్ కంభంపాటి, వనమాలి క్రియేషన్స్ 'పారిజాత పర్వం' నుంచి 'రంగ్ రంగ్ రంగీలా' పాట విడుదలచైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ 'నింగి నుంచి జారే' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది


తాజాగా రంగ్ రంగ్ రంగీలా పాటని విడుదల చేశారు మేకర్స్. కంపోజర్ రీ ఈ పాటని ఫ్యాషినేటింగ్ క్యాచి క్లబ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి

అందించిన సాహిత్యం మరింత ఆకర్షణీయంగా వుంది. ఈ పాటలో నటించిన శ్రద్ధా దాస్ స్వయంగా పాటని పాడటం విశేషం. శ్రద్ధా దాస్ వాయిస్, గ్లామరస్ ప్రజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.


బాల సరస్వతి కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.


తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి


సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం - సంతోష్ కంభంపాటి

ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్

నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్  

సహ నిర్మాత -అనంత సాయి

డీవోపీ-బాల సరస్వతి

సంగీతం-రీ

ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి

ఆర్ట్ డైరెక్టర్ - ఉపేందర్ రెడ్డి

డిజైనర్ - చిన్మయి కాకిలేటి

పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచెర్ల

సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు

సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల

పీఆర్వో -వంశీ శేఖర్

Share this article :