Home » » Producer K K Radha Mohan Interview About Bhimaa

Producer K K Radha Mohan Interview About Bhimaa

 'భీమా' డిఫరెంట్ జోనర్ కథ. చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది: నిర్మాత కె కె రాధామోహన్మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


'భీమా' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది?

మా సహా నిర్మాత శ్రీధర్ గారు, దర్శకుడు హర్ష ఈ కథతో గోపీచంద్ గారి దగ్గరకి వెళ్లారు. గోపీచంద్ గారికి కథ చాలా నచ్చింది. ఇంతకుముందు గోపీచంద్ గారితో పని చేశాం. ఆ అనుబంధంతో ఆయన నన్ను సజెస్ట్ చేశారు. తర్వాత నేనూ కథ విన్నాను. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. గోపీచంద్ గారు ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశారు కానీ ఈ పాత్ర చాలా డిఫరెంట్. చాలా కొత్త జోనర్ లో వుండే కథ ఇది. ఈ జోనర్ గోపి గారు గతంలో చేయలేదు. ప్రస్తుతం ప్రేక్షకుల ఇలాంటి కథలని గొప్పగా ఆదరిస్తున్నారు. తప్పకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందనే నమ్మకంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాం. కథలో చాలా సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వున్నాయి. ట్రైలర్ లో పోలీస్ కాకుండా గోపిచంద్ గారి మరో గెటప్ చూసి ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతున్నారు. అది ఏమిటనేది మార్చి 8న తెలుస్తుంది.


ఫాంటసీ ఎలిమెంట్స్, గోపిచంద్ గారి సెకండ్ లుక్ చూస్తుంటే అఖండతో పోలిక వస్తుంది.. అ స్టయిల్ లో ఉంటుందా ?

లేదండీ. 'అఖండ' కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు. భీమాలో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో వుంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ.  


హర్ష కన్నడలో పేరుపొందిన దర్శకుడు, తనని తెలుగులో పరిచయం చేయడం రిస్క అనిపించిందా?

ప్రతి ప్రాజెక్ట్ నిర్మాతకు రిస్కే. అయితే మనం ముందు కథని నమ్మాలి. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు కథ ఉందా లేదా? ప్రాజెక్ట్స్ కి సరిపడా నటీనటులు ఎవరు? ఎలాంటి సాంకేతిక నిపుణులు ఎంచుకోవాలని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే.  హర్ష చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తను కొరియోగ్రఫర్ కూడా. మా బెంగాల్ టైగర్ సినిమాకి చేశారు. భీమాని చాలా అద్భుతంగా తీశారు. అలాగే ఇందులో రెండు పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు.  


భీమా మీ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా కదా ?

ఈ సినిమా మంగుళూరు, బాదామి, ఉడిపి, మారేడుమిల్లి, వైజాగ్ ఇలా చాలా డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. అన్నపూర్ణలో ఒక భారీ టెంపుల్ సెట్ ని క్రియేట్ చేశాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీపడకుండా తీశాం. మేము అనుకున్న క్యాలిటీ ఇవ్వగాలిగాం. దాని కారణంగా బడ్జెట్ పెరిగింది. భీమా బిజినెస్ పరంగా హ్యాపీగా వున్నాం. టీజర్ ట్రైలర్ చాలా మంచి బజ్ క్రియేట్ చేశాయి. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యుటర్స్ సినిమాపై చాలా ఆసక్తి చూపించారు. పెద్ద సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. గోపీచంద్ గారి కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ చేశాం.  


ఇందులో గోపీచంద్ గారి పాత్రలో ఎంటర్ టైన్మెంట్ వుంటుంది చెబుతున్నారు. ఇప్పటివరకూ ఆయనలోని ఇంటెన్స్ కోణం మాత్రమే చూపించారు ?  

ట్రైలర్ లో చూపించినట్లుగా ఇందులో గోపిచంద్ గారిది బ్రహ్మరాక్షుడి క్యారెక్టరైజేషన్ గానే వుంటుంది. అయితే కథలో సిట్యువేషనల్ కామెడీ వుంటుంది. చిన్న లవ్ ట్రాక్ కూడా వుంది. కఠినమైన పోలీసు అధికారి ఇంట్లో కూడా కఠినమైనంగా వుండరు కదా. అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశాం.  


హీరోయిన్స్  ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ పాత్రలు ఎలాంటి వుంటాయి ?

ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ పాత్రలు డిఫరెంట్ గా వుంటాయి. పోలీస్ క్యారెక్టర్, మాళవిక శర్మ పాత్రల మధ్య ఓ ప్రేమకథ వుంటుంది.  ప్రియా భవానీ శంకర్ ది పూర్తిగా భీనమైన పాత్ర. అది ఇప్పుడే రివిల్ చేయకూడదు. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అది.


భీమా లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలా వుంటుంది ?

భీమాలో వీఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యత వుంది. ఎక్కడా రాజీపడకుండా చేశాం. కావాల్సిన సమయం కూడా తీసుకున్నాం. అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. అందరూ థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది.


రవి బస్రూర్ మ్యూజిక్ గురించి ?

రవి బస్రూర్ కేజీఎఫ్ సలార్ చేశారు. హర్ష కి రవి బస్రూర్ కి ముందే పరిచయం వుంది. ఈ సినిమాకి రవి బస్రూర్ అయితే బావుంటుందని అనుకున్నాం. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. నేను ఇప్పటికే మూడు సార్లు చూశాను. చూసిన ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చాయి.  


కొత్త సినిమాలు గురించి ?

అయుష్ శర్మ హీరోగా ఒక హిందీ సినిమా జరుగుతోంది. ఏప్రిల్  26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో ఓ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో వుంది.


ఆల్ ది బెస్ట్

థాంక్ యూShare this article :