"క్రైమ్ రీల్" టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి !!!
అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం.
ఈ చిత్ర పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిష్టర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినిమా మంచి విజయం సాధించాలి, సంజన అన్నే దర్శకురాలిగా ప్రతిభ చూపించాలని, కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ క్రైమ్ రీల్ అందరిని అలరించాలని కోరుకుంటున్న అన్నారు.
సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. బాబు కొల్లాబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం సంజన అన్నే.