Banita Sandhu to shoot in Bhuj for her Pan India film G2 with Adivi Sesh



అడివి శేష్‌ పాన్ ఇండియా ఫిల్మ్ 'G2' కోసం గుజరాత్‌లోని భుజ్‌ షూట్ లో జాయిన్ అయిన బనితా సంధు

అడివి శేష్ 'G2' చిత్రంలో బనితా సంధు హీరోయిన్ కనిపించనుంది. ఈ చిత్రం అద్భుతమైన యాక్షన్‌గా ఉంటుంది, ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇంతకుముందు అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది బనిత.

గుజరాత్‌లోని భుజ్‌ లో జరుగుతున్న 'G2' షూటింగ్ లో బనితా సంధు ఈ రోజు జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌ లో అడివి శేష్, బనిత పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్‌, బనితా సంధు తెరపై గొప్ప కెమిస్ట్రీని పంచుకోబోతున్నారు. ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఇంతకుముందు ఈ చిత్రం గురించి బనిత మాట్లాడుతూ.. G2 లో భాగం కావడం తనకు క్రియేటివ్ గా గొప్ప ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఇంతకు ముందు చేయని విధంగా చాలా కొత్తగా ఉంటుంది.

జి2లో ఇమ్రాన్ హష్మీ కూడా చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్ గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.

 

Post a Comment

Previous Post Next Post