Aditya Papagari Renowned Realtor, Ventures into the Film Industry




ఆదిత్య పాపగారి రియల్టర్ నుంచి సినిమా రంగంలోకి

రియల్ ఎస్టేట్ రంగంలో అంబరాన్ని తాకే విజయాలను అందుకున్నప్రముఖ రియల్టర్, మూన్ స్కేప్ రియాలిటీ వ్యవస్థాపకుడు సీఈఓ ఆదిత్య పాపగారి గురించి ఆ రంగంలో ఉన్నవారికి బాగా తెలుసు. పట్టువదలని విక్రమార్కుడు, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ప్రణాళికలు రూపొందించే పరాక్రముడు ఆదిత్య పాపగారి. కేవలం లావాదేవీలపై మాత్రమే దృష్టి పెట్టకుండా కస్టమర్ సంతృప్తిపై పనిచేస్తాడు కాబట్టే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా కస్టమర్లతో సామాన్యుడిలా కలిసిపోతాడు. సాదకబాధకాలు తెలుసుకుంటాడు. 

ఆయన ఎప్పుడూ ధీర్ఘకాలిక విజయాల వైపే అడుగులు వేస్తాడు అనడానికి నిదర్శనం మూన్ స్కేప్ రియాలిటి. మూన్ స్కేప్ రియాలిటిని స్థాపించి ఎంతో మంది కలలను నిజం చేశారు. 2017లో స్థాపించిన ఆ వెంచర్ ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగింది. ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ స్థాయినుంచి ఒక వ్వవస్థను నడిపించే స్థాయికి ఎదిగారంటే ఆయన పట్టుదల, దూరదృష్టి ఎలాంటివో అర్థం చేసుకొవచ్చు. కరోనా టైమ్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. అలాంటి గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడి మార్కెట్‌ ను శాసిస్తున్నారు ఆదిత్య పాపగారి. అలాంటి ఘనుడు ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. 

సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఎంచుకున్న ఏ రంగంలోనైనా సరే అనుకున్న విజయాలు సాధించడం ఆయనకు సర్వసాధారణం. అందుకే క్లిష్టమైన సినిమా రంగంలో ఇష్టంగా అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది ఆదిత్య పాపగారి మోటో అని తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తులే సినిమా రంగానికి కావలి. ఆదిత్య పాప స్థాపించే ప్రొడక్షన్ సంస్థ నుంచి మంచి సినిమాలు రావాలని, సినిమా పరిశ్రమలో మంచి విజయాలు అందుకోవాలని కోరుకుందాం. ఆయన ప్రొడక్షన్ సంస్థకు సంబంధించిన వివరాలు, బ్యానర్ తదితర అంశాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post