Home » » Allu Arjun wax statue at Madame Tussaud’s in Dubai

Allu Arjun wax statue at Madame Tussaud’s in Dubai

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో వాక్స్ స్టాట్యూని ఏర్పాటు చేసిన సౌత్ ఇండియాలో తొలి నటుడు అల్లు అర్జున్



దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: దుబాయ్ లోని బ్లూ వాటర్స్ దగ్గర ఉన్న మేడమ్ టుస్సాడ్స్  ప్రపంచంలో ప్రఖ్యాతి చందిన వారి మైనపు విగ్రహాలని షో కేస్ చేసే మ్యుసీయం. వారు ఇప్పుడు మన తెలుగు స్టైలిష్ స్టార్ గా మొదలై ప్రపంచ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూ మేడమ్ టుస్సాడ్స్ మ్యుసీయంలో పెట్టారు, మీడియా మరియు ఇన్ఫ్లుఎంసర్స్ ఎంతో మంది అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూని చూడడానికి వచ్చారు.. 



తన నటనతో, డాన్స్ తో, ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకుని, భారతదేశాలోనే ప్రఖ్యాత ఫిలిం అవార్డు అయిన నేషనల్ అవార్డుని సాధించి, ఇప్పుడు ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయి, మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు, ఈ వాక్స్ స్టాట్యూ పర్ఫెక్ట్ గా రావడం కోసం 200 రకాల మెషర్మెంట్స్ ని అల్లు అర్జున్ నుండి, తను చేసే డాన్స్ మూవ్స్ నుండి సేకరించడం జరిగింది. మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మననేర్ అయిన Sanaz Kollsrud అన్నారు. 



ఇప్పటి వరుకు సౌంత్ ఇండియా నుండి ఏ ఒక్క ఆక్టర్ వాక్స్ స్టాట్యూ కూడా దుబాయ్ లో పెట్టలేదు అని, అల్లు అర్జున్ ఏ మొట్ట మొదటి సౌత్ ఇండియన్ ఆక్టర్ అని చెప్పారు.. అయితే దుబాయ్ లో ఉండే సౌంత్ ఇండియాన్స్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫాన్స్ ఈ వాక్స్ స్టాట్యూని చూడడానికి వస్తారని వారు భావిస్తున్నట్టు తెలిపారు. 



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వాక్స్ స్టాట్యూని తాను చూసుకుని, నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉంది అని, చాలా రియలిస్టిగా చేశారు అని ప్రశంసించారు.. 


Share this article :