Rajadhani Files Trailer on February 5th

 తెలుగువన్ ప్రొడక్షన్స్ 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ ఫిబ్రవరి 5న విడుదల  



శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో అఖిలన్, వీణ నటులుగా పరిచయం అవుతున్నారు.


ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 5న ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నారు. ''బిడ్డను పొదిగే గర్భంలో గొడ్దలి దించిన కర్కశత్వం' అనే వాక్యంతో డిజైన్ చేసిన ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పవర్ ఫుల్ గా వుంది. పోస్టర్ లో వేలాది మంది రైతులు అందోళన చేస్తూ కనిపించడం మనసుల్ని కదిలిస్తుంది.


ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రమేష్ డీవోపీ పని చేస్తుండగా,  కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటర్. గాంధీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.


నటీనటులు: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్ , విశాల్, మధు, అజయరత్నం, అంకిత ఠాకూర్, అమృత చౌదరి తదితరులు


టెక్నికల్ టీం:

బ్యానర్: తెలుగువన్ ప్రొడక్షన్స్

సమర్పణ: హిమబిందు

నిర్మాత: కంఠంనేని రవిశంకర్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాను

సంగీతం: మణిశర్మ

డీవోపీ: రమేష్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్ రావు

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గురుచరణ్, వెనిగళ్ల రాంబాబు

డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల

కొరియోగ్రాఫర్: గణేష్

స్టంట్స్: నందు, రామకృష్ణ, జీవన్

ఆర్ట్ డైరెక్టర్: గాంధీ

పీఆర్వో: వంశీ-శేఖర్

Post a Comment

Previous Post Next Post