Home » » Mama Maschindra Pre Release Event Held Grandly

Mama Maschindra Pre Release Event Held Grandly

‘మామా మశ్చీంద్ర’ యూనిక్ ఎంటర్ టైనర్. చాలా సర్ ప్రైజ్ లు వుంటాయి. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు‘మామా మశ్చీంద్ర’ అద్భుతంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది: హీరో శర్వానంద్


‘మామా మశ్చీంద్ర’ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా వుంది:  : హీరో విశ్వక్ సేన్


మామా మశ్చీంద్ర’ డిఫరెంట్ సినిమా. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: హీరో శ్రీవిష్ణు  


మామా మశ్చీంద్ర’ కోసం ఎదురుచూస్తున్నాను: డైరెక్టర్ శేఖర్ కమ్ముల


నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్‌ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చిన శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. నాకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయని నమ్ముతున్నాను. మామా మశ్చీంద్ర’ కథ నచ్చి సినిమా నిర్మించిన సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ గారికి థాంక్స్. ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని మిస్ అవుతున్నాం. మంచి సినిమా చేశాం. ఆయనకి ఈ సినిమా అకింతం చేయొచ్చని అనుకుంటున్నాం. ఈ సినిమాకి పని చేసిన టీం అందరికీ థాంక్స్. ఈషా చాలా చక్కగా నటించింది. తనకి ,దుర్గాకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా వుంటాయి. మిర్నాళిని రవి, నాకు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఖుషి సినిమాని గుర్తు చేస్తాయి. దర్శకుడు హర్ష ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. సినిమా పూర్తయ్యే సరికి ఈ పాత్ర చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. దర్శకుడిగా తన గురించి చెప్పాలంటే రచయితలు ఆగిపోయిన దగ్గర నుంచి తను మొదలౌతాడు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఇందులో చాలా సర్ప్రైజ్ లు వుంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. దుర్గా పాత్ర గెటప్  వేసుకొని సెట్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. అలాగే పరశురాం రోల్ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. మామ మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం అన్నీ వుంటాయి. కథ యూనిక్ గా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఒత్తిళ్ళు వుంటాయి. మామ మశ్చీంద్ర’ సినిమా చూస్తున్నపుడు ఆ ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోతారు. సినిమా మహేష్ బాబు గారిలా పరిగెడుతుంది (నవ్వుతూ). సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు కొత్త రకం కథ కొత్తగా వుందని ప్రేక్షకులు ఫీలౌతారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్స్ లో చూడాలి. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు.  


శర్వానంద్ మాట్లాడుతూ.. మేము ఒక్క రోల్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం.  అలాంటింది ఇందులో సుధీర్ ఏకంగా ట్రిపుల్ రోల్ లో చేస్తున్నారు. ఇలా చేయాలంటే చాలా ధైర్యం వుండాలి. సుధీర్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. సినిమా పట్ల చాలా అంకితభావంతో  ఉంటాడు. తన హార్డ్ వర్క్ ఇక్కడివరకూ తీసుకొచ్చింది. ‘మామా మశ్చీంద్ర’ అద్భుతంగా కనిపిస్తోంది, ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుంది. హర్ష అమ్మ చెప్పింది చిత్రం నుంచి స్నేహితుడు. తను చాలా మంచి రచయిత. సునీల్ గారు, జాన్వి మాకు ఫ్యామిలీ మెంబర్స్ లా వుంటారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 6న అందరూ థియేటర్ లో సినిమా చూడాలి’ అని కోరారు.


విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. హర్ష గారికి అమృతం సీరియల్ నుంచి అభిమానిని. తన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం.  హర్ష   గారి రైటింగ్ లో సినిమా చేస్తున్నాను. హర్ష గారు ఏది చేసిన సింపుల్ గా వుండదు. ఇందులో సుధీర్ గారు మూడు పాత్రలు చేస్తున్నారంటే కథ ఎంత విలక్షణంగా వుంటుందో అర్ధమౌతుంది. ‘మామా మశ్చీంద్ర’ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.


శ్రీవిష్ణు మాట్లాడుతూ.., మామా మశ్చీంద్ర’ ప్రమోషనల్ కంటెంట్ చూస్తునపుడు ఇది డిఫరెంట్ కథ అనిపిస్తుంది. ఇలాంటి డిఫరెంట్ కథని ప్రోత్సహించి సినిమాని నిర్మించిన సునీల్ గారికి, పుస్కూర్ రామ్ మోహన్ గారికి అభినందనలు. హర్ష వర్ధన్ గారికి   నటుడిగా ఒక ప్రత్యేకమైన శైలి వుంది. ఇప్పుడు దర్శకుడిగా ఆయనకి ఈ సినిమా మంచి విజయం ఇస్తుందని, ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సుధీర్ బాబు గారు కొత్తరకం కథలు ప్రయత్నిస్తుంటారు.  ఫిజిక్ ని మెయింటైన్ చేయడం గానీ ఫిట్నెస్ పై శ్రద్దపెట్టడంలో గానీ ఆయనలో క్రమశిక్షణ కనిపిస్తుంటుంది. ఆయన అంకితభావం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుంది’ అన్నారు


శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ చాలా బావుంది. హర్ష తో లీడర్ సినిమా నుంచి పరిచయం. అప్పుడే తన కామెడీ టైమింగ్ బావుందని అనుకునేవాడిని. అలాగే అమృతం షో కూడా చాలా ఇష్టం. తను బాగా చేస్తాడనే నమ్మకం వుంది. సుధీర్ బాబు గారి గురించి ఎవరు మాట్లాడిన తన హార్డ్ వర్క్ గురించే చెబుతారు. ఏసియన్ ఫిలిమ్స్, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.దర్శకుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ... ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చిన శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. మ్యుజిషియన్, సింగర్ ని కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వచ్చాను. మ్యూజిక్ చేయలేకపోయాను కానీ నటుడు రచయిత ఇప్పుడు దర్శకుడిని అయ్యాను. తెరపై నన్ను చూసి అభిమానించిన ప్రేక్షకులు ప్రేమ నన్ను ఇంతకాలం నడిపింది. ఈ ప్రయాణంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పే సందర్భం ఈ ప్రీరిలీజ్ వేడుకతో దొరికింది. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు.  ప్రేక్షకులు వున్నారనే ధైర్యంతో ఈ సినిమా చేశాను. మీ అందరినీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మామా మశ్చీంద్ర’లో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. గుండెజారే, మనం లాంటి మ్యాజిక్ వున్న కథ ఇది. మంచి ప్రేమకథ వుంటుంది. అనుబంధాలు వున్నాయి. ఇది ఒక అమ్మకి సంబందించిన కథ. తండ్రికూతుళ్ళ కథ. పరశురాం కథ. చాలా చక్కని ఎమోషన్స్ వున్నాయి. మనం లానే ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం వుంది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణగారితో ఒక సీన్ చేయించాలని అనుకున్నాం. కానీ దురద్రుష్టవశాత్తూ ఆయన వెళ్ళిపోయారు. ఆ సీన్ వుంటే బావుండేది. అదొక్క అసంతృప్తి తప్ప మిగతావన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగాయి. అలాగే నారాయణ్ దాస్ నారంర్ గారిని కూడా చాలా మిస్ అవుతున్నాం. సునీల్ గారు, పుస్కూర్ రామ్ మోహన్ రావు గారు ఎంతో సపోర్ట్ చేశారు. చైతన్ భరద్వాజ్, డీవోపీ పీజీ విందా, యాక్షన్ అంజి ఇలా ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అలీ రెజా చాలా చక్కని పాత్ర చేశారు. హరితేజ ఇందులో మదర్ పాత్ర చాలా బాగా చేశారు. ఈషా రెబ్బా, మృణాలిని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాతో వాళ్ళకి తప్పకుండా మంచి గుర్తింపు వస్తుంది.  సునీల్ గారు రామ్ మోహన్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. అలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. నాలాంటి కొత్త దర్శకుడితో ఇలాంటి సవాల్ తో కూడుకున్న కథని నమ్మి సినిమా చేసిన మై హీరో సుధీర్ బాబు గారికి ధన్యవాదాలు. సుధీర్ బాబు గారు లేకపోతే ఇది సాధ్యపాడేది కాదు. ఇది ఫ్యాన్స్ కొరుకునే సినిమా అవుతుందనే నమ్మకం వుంది. మంచి సినిమాని ఆశించే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని చేయడం జరిగింది. మామా మశ్చీంద్ర’ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నిర్మాత  పుస్కూర్   రామ్ మోహన్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారితో మాకు మంచి అనుబంధం వుంది. కృష్ణ గారితో సంభవం అనే చిత్రాన్ని తీశాం. సుధీర్ బాబు గారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మూడు గెటప్స్ లో చాలా కష్టపడ్డారు. మేకప్  వేసుకోవడానికి రెండేసి గంటలు పట్టేది. అవుట్ ఫుట్ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. హర్ష గారు రాసిన మనం, గుండెజారి చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కూడా ఖచ్చితంగా అలరిస్తుంది.  రచయిత నుంచి దర్శకులుగా మారిన త్రివిక్రమ్ గారు కొరటాల శివ గారు చాలా పెద్ద దర్శకులు అయ్యారు. అలాగే హర్ష గారు కూడా మా సినిమాతో అంత పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను.


అశోక్ గల్లా మాట్లాడుతూ.. ఏసియన్ సినిమాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో కొత్తదనం వుంటుంది. ఇందులో మూడుపాత్రలు చూస్తున్నపుడు చాలా క్రేజీ అనిపిస్తుంది. సుధీర్ బాబు గారు మొదటి నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాను. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.


రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. హర్ష రైటింగ్ సూపర్. అమృతంతో పాటు మనం ,గుండెజారి చిత్రాలు నాకు చాలా ఇష్టం. సుధీర్ బాబు గారు మూడు పాత్రలల్లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఏసియన్ సినిమాస్ కి, టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.


హీరోయిన్ ఈశా రెబ్బా మాట్లాడుతూ..  హర్ష గారికి దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా వుంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సుధీర్ బాబు గారికి హ్యాట్సప్. మూడు పాత్రలని చాలా అద్భుతంగా చేశారు. మిర్నాళిని నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. విందా గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అక్టోబర్ 6న  సినిమాని తప్పకుండా చూడండి’’


మిర్నాళిని రవి మాట్లాడుతూ.. సుధీర్ బాబు గారు హార్డ్ వర్కింగ్ పర్శన్. చాలా అంకితభావంతో పని చేశారు. ఆయన నుంచి  ఎంతో స్ఫూర్తిపొందాను. హర్ష గారి డైరెక్షన్ లో నటించడం అనందంగా వుంది.  ఆయన ఇచ్చిన పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నాను. ఈషా స్వీట్ పర్శన్. సృష్టికి థాంక్స్. అక్టోబర్ 6న సినిమాని అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని కోరారు. ఈ వేడుకలో హరితేజ, అలీరెజా, చైతన్య ప్రసాద్  చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


Share this article :