Home » » Hero Naveen Chandra Interview About Month of Madhu

Hero Naveen Chandra Interview About Month of Madhu

'మంత్ ఆఫ్ మధు' సహజత్వం ఉట్టిపడే చాలా ప్రత్యేకమైన చిత్రం: హీరో నవీన్ చంద్రనవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


'మంత్ ఆఫ్ మధు' ఎలా మొదలైయింది ?

దర్శకుడు  శ్రీకాంత్ నాగోతితో భానుమతి & రామకృష్ణ చేశాను. ఈ చిత్రానికి చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. మేము ఇద్దరం కలసి మరో సినిమా చేయాలనే ఆలోచన వున్నప్పటికీ నేను అప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా వున్నాను. తర్వాత ఏం చేస్తున్నావ్ అని ఓసారి అడిగితే.. ఓ రెండు కథలు అనుకుంటున్నాని చెప్పారు. ఇందులో మంత్ ఆఫ్ మధు నాకు చాలా నచ్చింది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటుదనిపించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే అన్నాను. అలా ఈ సినిమా మొదలైయింది.


ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

ఇందులో సహజత్వానికి చాలా దగ్గర వుండే పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర పేరు మధుసూధనరావు. చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అతన్ని హీరోలా చూస్తుంటారు. ఐతే కాలం గడిచిన కొద్ది ఎవరి జీవితాల్లోకి వారు వెళ్ళిపోతారు. మధు మాత్రం అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండిపోతాడు. మందు, సిగరెట్ కి అలవాటు పడిపోతాడు. ఒకరి కింద ఉద్యోగం చేయాలని వుండదు. తనకి డబ్బు పై కూడ ఆశ లేదు. తనకి ఏ లక్ష్యం వుండదు. ఏ భాద్యత తీసుకోడు. చిన్నప్పటి నుంచి అందరూ ఒక హీరో ఇమేజ్ తో చూడటంతో అందులోనే ఉండిపోతాడు.

ఒక వ్యక్తికి లేని బిల్డప్ ని చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వడం మనం గమనిస్తుంటాం. అదే నిజం అనుకుని అందులోనే వుండిపోయే పాత్రలు మనకు నిజ జీవితంలో ఎదురౌతుంటాయి. ఇందులో మధు పాత్ర కూడా అలానే ఉంటుంది. కథ నచ్చి ఎంచుకున్న సినిమా ఇది. 'మంత్ ఆఫ్ మధు చాలా స్పెషల్ మూవీ.  


ఇందులో అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి మధు పాత్ర ఎలా ఉంటుంది ?

ఇందులో మధుమతి పాత్ర యుఎస్ ఎన్ఆర్ఐ. తను అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి. అక్కడ చాలా ఇండిపెండెంట్ గా పెరుగుతారు. అక్కడ కల్చర్ కి అలవాటు పడిన వారికి ఇండియా కల్చర్ కి తగ్గట్టు బిహేవ్ చేయమని చెప్పడం కష్టం. ఆ అమ్మాయి యుఎస్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే వుంటుంది.  


మంత్ ఆఫ్ మధు అంటే మీరా ..ఆ అమ్మాయినా ?

ఇద్దరం. ఆ అమ్మాయికి ఇచ్చిన ఒక నెల.. ఈ నెలలో తనతో నా పాత్ర స్నేహం, దీంతో స్వాతితో పాటు మా ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది కథ.


స్వాతి పాత్ర ఎలా ఉంటుంది ?

తను తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. తెలుగు అమ్మాయి ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పాత్రలో  పెయిన్ ఉంటుంది. ఈ కథ చాలా యూనిక్ గా వుంటుంది. ఈ సినిమాలో పాత్రల ప్రయాణం, వారి ఛాయిస్ లని చూపించబోతున్నాం.  


నటుడిగా మీ గోల్ ఏమిటి ?

మంచి పాత్రలు చేయాలి. మంచి కథలు చెప్పాలి. ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా వున్నాను. హీరోగా ఆరు సినిమాలు విడుదలకు వున్నాయి  . క్యారెక్టర్ గా ఐదు, విలన్  గా మూడు  సినిమాలు ఫినిష్ అయ్యాయి. దర్శకులకు కూడా నేను మంచి నటుడనే నమ్మకం ఉందని భావిస్తున్నారు. అందుకే రకరకాల సినిమాలు, పాత్రలు వస్తున్నాయి.


ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?

శంకర్ గారి గేమ్ చేంజెర్ తో పాటు దాదాపు ఎనిమిది సినిమాలు వున్నాయి.  


ఆల్ ది బెస్ట్

థాంక్స్Share this article :