Home » » 70Lakhs Views For Sid Sriram song from Mechanic

70Lakhs Views For Sid Sriram song from Mechanic

 మెకానిక్ చిత్రం లోని సిద్ శ్రీరామ్ పాడిన పాటకి 70 లక్షల వ్యూస్



టీనా శ్రీ క్రియేషన్స్ పతాకం పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్ గా నాగ  మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర రచన-దర్శకత్వం వహించిన చిత్రం "మెకానిక్" ట్రబుల్ షూటర్ ట్యాగ్ లైన్. ఈ చిత్రం షూటింగ్ మరియు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ పన్ను లో బిజీ గా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే  సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" ఇంటర్నెట్ లో 70 లక్షల వ్యూస్ తో ట్రేండింగ్ అయింది. 


ఈ సందర్భంగా నిర్మాత నాగ  మునెయ్య(మున్నా) మాట్లాడుతూ "వినోద్ యాజమాన్య అందించిన సంగీతం మా చిత్రానికి హైలైట్. ఇటీవలే  సిద్ శ్రీరామ్ పాడిన పాట "నచ్చేసావే పిల్లా నచ్చేసావే" ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయింది. యూట్యూబ్ లో 70 లక్షల వ్యూస్ మరియు ఇంస్టాగ్రామ్ లో 10 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ముందు విడుదల అయిన 'టూలేట్ బోర్డు ఉంది నీ ఇంటికి' అనే పాటని 16 లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించారు. మా "మెకానిక్" చిత్రం విడుదల కాకముందే మంచి మ్యూజికల్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. మా చిత్రం తెలుగుతో పాటు తమిళం,  కన్నడ, హిందీ  భాషల్లో  విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.  త్వరలో సెన్సార్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటిస్తాం" అని తెలిపారు. 


చిత్రం పేరు : మెకానిక్


నటి నటులు : మణి సాయి తేజ, రేఖ నిరోషా, తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు


ఫైట్ మాస్టర్ : డ్రాగన్ ప్రకాష్


కెమెరా మాన్ : ఎస్ వి శివరాం 


ఎడిటర్ : శివ శర్వాని 


థ్రిల్స్ : డ్రాగన్ ప్రకాష్ 


కొరియోగ్రాఫేర్ : కపిల్ మాస్టర్, బాలు మాస్టర్ 


డి ఐ, వి ఎఫ్ ఎక్స్ : చెర్రీ సంతోష్ 


పబ్లిసిటీ డిజైన్స్ : మోషన్ మార్కెట్ (అశోక్ కుమార్)


లిరిక్స్ : ముని సాహికార 


మ్యూజిక్ : వినోద్ యాజమాన్య 


కో ప్రొడ్యూసర్ : నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రసి ఉపేంద్ర 


నిర్మాత : నాగ  మునెయ్య(మున్నా)


కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు : ముని సహేకర



Share this article :