Hailesso Hailessa Song Form Nidurinchu Jahapana Launched

 మంత్రి మల్లారెడ్డి లాంచ్ చేసిన ఆనంద్ వర్ధన్, ప్రసన్న కుమార్ దేవరపల్లి, ఎ.ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ 'నిదురించు జహాపన' హైలెస్సో హైలెస్సా సాంగ్  



ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్, శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై  సామ్ జి, వంశీ కృష్ణ వర్మ నిర్మిస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్  'నిదురించు జహాపన'. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్రం మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.  


తాజాగా మేకర్స్ 'నిదురించు జహాపన' మ్యూజికల్ జర్నీ ప్రారంభించారు. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్  హైలెస్సో హైలెస్సా పాటని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి లాంచ్ చేశారు. ఒక అందమైన ప్రేమకథ ని తెలియజేసే లవ్లీ మెలోడీగా ఈ పాటని స్వరపరిచారు స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్.


ధనుంజయ్ సీపాన, ఎ.ప్రవస్తి వోకల్స్ మెస్మరైజింగ్  గా  ఉన్నాయి. ఈ పాటకు డి. ప్రసన్న కుమార్ రాసిన సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి.


రామరాజు, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  ఆనంద రెడ్డి నడకట్ల కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్, నానిబాబు కారుమంచి ఎడిటర్స్.


తారాగణం: ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సాహోతా, రామరాజు, పోసాని కృష్ణ మురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదొరై,  జబర్దస్త్ శాంతి కుమార్ తదితరులు


సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం:  ప్రసన్న కుమార్ దేవరపల్లి

నిర్మాతలు : సామ్, జి. వంశీ కృష్ణ వర్మ

సంగీతం : అనూప్ రూబెన్స్

డీవోపీ: ఆనంద రెడ్డి నడకట్ల  

ఎడిటర్ : వెంకట్, నానిబాబు కారుమంచి

లిరిక్స్ : కళ్యాణ్ చక్రవర్తి, శ్రేష్ట, ప్రసన్న కుమార్ దేవరపల్లి

ఆర్ట్ డైరెక్టర్: టాగోర్

యాక్షన్ : నందు

పీఆర్వో: వంశీ - శేఖర్

Post a Comment

Previous Post Next Post