Home » » Mystery Movie is in Dubbing Works

Mystery Movie is in Dubbing Works

 డబ్బింగ్ కార్యక్రమాలలో "మిస్టరీ" సినిమా




పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాత గా , తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మిస్టరీ". హీరోయిన్ గా స్వప్న చౌదరి, ముఖ్య పాత్రల్లో అలీ, సుమన్, తనికెళ్ళ భరణి, సత్య శ్రీ, వెంకట్ దుగ్గిరెడ్డి, రవి రెడ్డి , గడ్డం నవీన్, ఆకెళ్ల లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు అలీ డబ్బింగ్ చెప్పారు.


ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ ఇది ఒక థ్రిల్లర్ కామెడీ సినిమా, సాయి అనుకున్న కథ ని అనుకున్నట్లు తీసాడు, ఈ రోజే నా పాత్ర కి డబ్బింగ్ చెప్పుకున్నాను. టీం అందరికీ అభినందనలు అని అన్నారు.


ఈ సినిమా కి కథ మాటలు - శివ కాకు, కెమెరా - సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ - సూర్య , సంగీతం- రామ్ తవ్వ, లిరిక్స్ - శ్రీనివాస్,పి.ఆర్.ఓ.పవన్ పాల్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ - తల్లాడ సాయికృష్ణ, నిర్మాత- వెంకట్ పులగం.



Share this article :