Home » » Daksha Movie Releasing on August 25th

Daksha Movie Releasing on August 25th

 ఆగస్టు 25న "దక్ష" చిత్రం విడుదల



శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై  తల్లాడ శ్రీనివాస్ నిర్మాత గా , వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం " దక్ష". ప్రముఖ నటుడు శ్రీ శరత్ బాబు గారి అబ్బాయి ఆయుష్ హీరో గా నటిస్తున్న సినిమా " దక్ష". సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకు సిద్ధం గా ఉంది.


ఈ సందర్భంగా హీరో ఆయుష్ మాట్లాడుతూ "రెండు సంవత్సరాల కష్టం మా దక్ష సినిమా, మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎక్కడ రాజీ పడకుండా పూర్తి చేశారు, మా నాన్న గారికి ఈ సినిమా అంకితం చేస్తున్నాం" అని అన్నారు.


ఈ సినిమా కి కథ మాటలు -శివ కాకు,  డైరెక్షన్ - వివేకానంద విక్రాంత్, నిర్మాత- తల్లాడ శ్రీనివాస్, కో- ప్రొడ్యూసర్ - తల్లాడ సాయికృష్ణ,

సంగీతం - లలిత్

నటి నటులు - ఆయుష్ , అఖిల్,రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమా 25 ఆగస్టు న విడుదల అవుతుంది.



Share this article :