Home » » Kajuluri Kondababu Playing Different Roles

Kajuluri Kondababu Playing Different Roles

నటుడిగా తూర్పు గోదావరి ఖ్యాతిని

ఇనుమడింప జేస్తున్న

కాజులూరు కొండబాబు



గంభీరమైన కంఠస్వరం, తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు, నల్లేరు మీద నడకలా తూగోజి యాసపై తిరుగులేని సాధికారత... వీటన్నిటికీ మించి ఆజానుబాహు విగ్రహం... ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని "కాజులూరు" వాస్తవ్యుడైన "కొండబాబు"ను వెతుక్కుంటూ అవకాశాలు వరించేలా చేస్తున్నాయి!!


"పుట్టిన ఊరు... పుట్టుకనిచ్చిన తల్లి" దైవంతో సమానంగా భావించే కొండబాబు... నటుడిగా తన ఇంటి పేరుగా తన ఊరు పేరు పెట్టుకోవడం విశేషం. "నేను నటించినవి ఇప్పటికి చాలా కొన్ని సినిమాలు మాత్రమే. కానీ ఆ సినిమాలు చూసిన మా ఊరివాళ్లు "మా కొండబాబు" అని గర్వంగా చెప్పుకోవడం నా చెవినబడిన మరుక్షణం నా "స్క్రీన్ నేమ్" ను "కాజులూరు కొండబాబు"గా ఫిక్స్ అయిపోయా" అంటారు!!


"రాముడు లేని రాజ్యంలో, సింహాద్రి అప్పన్నా కొండ దిగిరా, పెండింగ్ ఫైల్" తదితర నాటకాలతో నటుడిగా తన సత్తాను చాటుకున్న కొండబాబు... అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేస్తుంటే... రోమాలు నిక్క బొడుస్తుండగా కళ్ళు, చెవులు అప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇందుకుగాను రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కొండబాబును కాకుండా... ఇంకెవరిని వరిస్తుంది?


రేలంగి, రావు గోపాలరావు, అంజలి, జయప్రద వంటి లెజెండరీ యాక్టర్స్ ను అందించిన తూగోజి వాసి అయిన కొండబాబు తండ్రిగా తన బాధ్యతలు నూటికి నూరు పాళ్ళు నెరవేర్చిన తర్వాత... తన ఊరివాళ్ళ ప్రోత్సాహంతో సినిమా రంగంపై దృష్టి సారించారు. భగవంతుడు తనకు కలిగించిన భార్యావియోగం కూడా... సినిమాలపై మనసు పెట్టడానికి ఒక కారణమని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనవుతారు కొండబాబు. "రారండోయ్ వేడుక చూద్దాం" చిత్రంలో మినిస్టర్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి, అనంతరం "పేపర్ బాయ్"లో డాక్టర్ గా, మెగా తనయ సుస్మిత కొణిదెల నిర్మించిన "షూట్ అవుట్" వెబ్ సిరీస్ లో శ్రీకాంత్ అన్నయ్యగా నటించి మెప్పించారు. "నేల టికెట్, నారప్ప" చిత్రాల్లోనూ మెరిశారు!!


ఇంకా పేరు పెట్టని చిత్రంలో రాజీవ్ కనకాల తండ్రిగా, విడుదలకు సిద్దం అవుతున్న "ఫుల్ బాటిల్" చిత్రంలో రాశి ఫాదర్ గా, రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కుతున్న "రజాకార్" చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న కొండబాబు నటనను వీక్షించాక... "ఆహుతి ప్రసాద్ లేని లోటును భర్తీ చేస్తాడు" అనకుండా ఉండలేరు. "రావు రమేష్"కు ప్రత్యామ్నాయం అనేవాళ్ళు కూడా లేకపోలేదు!!


కల్యాణ్ కృష్ణ, సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి చిత్రాలలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న కొండబాబు మరికొన్ని ప్రాజెక్టులు కూడా సైన్ చేశారు. తాము తీయబోయే సినిమాల కోసం కొండబాబును 9177756868 నంబర్ లో కాంటాక్ట్ చేయవచ్చు!! 


Share this article :