Boys Hostel Success Meet

 ‘బాయ్స్ హాస్టల్’ కు నెక్స్ట్ లెవల్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులకు కొత్త తరహా చిత్రం అందించడం ఆనందంగా వుంది: బాయ్స్ హాస్టల్ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్




టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో గ్రాండ్ గా విడుదల చేశాయి. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు. బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న తెలుగులో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ‘స్టూడెంట్ ఫిల్మ్ అఫ్ ది ఇయర్’ గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.  


సక్సెస్ మీట్ లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఎక్కడున్నా ఆదరించడం తెలుగు ప్రేక్షకుల ప్రత్యేకత. ‘హాస్టల్ బాయ్స్’ చిత్రంతో అది మరోసారి రుజువయింది.  ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చిన చిత్రం బాయ్స్ హాస్టల్. థియేటర్ లో ప్రేక్షకుల నవ్వులు చూస్తున్నపుడు వచ్చే తృప్తి వేరు. అలాంటి గొప్ప తృప్తి, మజాని ఇచ్చిన చిత్రమిది. నాగార్జున గారు ఈ సినిమా చేస్తున్నపుడు ఏ జోనర్ సినిమా అని అడిగారు. ఏం చెప్పాలో కాసేపు  ఆలోచించాను.( నవ్వుతూ). ఎందుకంటే ఇది చాలా కొత్త తరహా చిత్రం. నాగర్జున గారు ఈ సినిమా చూసి.. ‘చాలా యూనిక్ గా వుంది కదా’ అన్నారు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మాకు కూడా కొత్తకొత్తగా ఆలోచనలు పుడతాయి. సినిమాని థియేటర్ లో చూడండి. తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తుంది. ఇది మా గ్యారెంటీ’’ అన్నారు.


నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తదనం ఉన్న కంటెంట్ ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులకు ముందుంటారు. హాస్టల్ బాయ్స్ సినిమాని ప్రేక్షకులు, ముఖ్యంగా టార్గెట్ ఆడియన్స్ ఆదరిస్తున్న తీరు నెక్స్ట్ లెవల్ లో వుంది. స్టూడెంట్స్, హాస్టల్ లో చదువుకున్న వాళ్ళు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర యూనిట్ కన్నడలో కూడా కొత్తవాళ్ళు. అలాంటి కొత్త యూనిట్ కి తెలుగులో వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదు. తప్పకుండా ఈ సినిమాని చూడండి. కొత్త అనుభూతిని పొందుతారు. చూసిన ప్రేక్షకులు చూడని వారితో సినిమా గురించి చెప్పండి. ఇలాంటి కొత్త ప్రయత్నాలని ప్రోత్సహిస్తే మరిన్ని కొత్త తరహా చిత్రాలు వస్తాయి. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.


నిర్మాత శరత్ మాట్లాడుతూ.. సినిమా చూసిన అందరికీ విపరీతంగా నచ్చుతుంది. కొత్త ప్రయత్నం చేస్తే అభినందించే ప్రేక్షకులు ఉన్నారని మరోసారి రుజువయింది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. యూత్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంత్ ఎండ్ కావడంతో స్టూడెంట్స్ కి  పాకెట్ మనీ ఇష్యూ వస్తుంది . అందుకే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన థియేటర్స్ జాబితా రిలీజ్ చేస్తాం. సునీల్ నారంగ్ గారికి, సుప్రియ గారికి కృతజ్ఞతలు. చాలా ఎక్కువ మందికి మా సినిమా చేరాలనే ఉద్దేశం ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమా చాలా బాగుంది. తప్పకుండా చూడండి. ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రం యూనిట్ కు థాంక్స్. చాలా కష్టపడ్డారు. చాయ్ బిస్కెట్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తెలుగు డబ్బింగ్ కి మంచి పేరు రావడం ఆనందంగా వుంది. మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు’’ తెలిపారు.


దర్శకుడు నితిన్ కృష్ణ మూర్తి మాట్లాడుతూ.. ఇది తెలుగు సినిమాలా వుండాలని చాలా హార్డ్ వర్క్ చేసి డబ్ చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ నిర్మాతలకు థాంక్స్. తెలుగులో వస్తున్న ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది. కొత్తవారిని సపోర్ట్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు ఒక అడుగుముందు ఉంటారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మీ అందరి ఆదరణకు  కృతజ్ఞతలు’’ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో బాయ్స్ హాస్టల్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post