Minister Talasani Srinivas Yadav Launched Naa Nee Prema Katha Trailer

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేసిన పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ ‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్



అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... ట్రైలర్ అద్భుతంగా ఉంది.  హీరోగా దర్శకునిగా అముద శ్రీనివాస్ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. నటీనటులు అంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రం నిర్మాత  పోత్నాక్ శ్రవణ్ మంచి లాభాలు రావాలి. హీరో దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలి. చిత్ర యూనిట్ అందరికీ శుభాభినందనాలు’ తెలిపారు.  


ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.


నటీనటులు : అముద శ్రీనివాస్. కారుణ్య చౌదరి, రమ్య, అజయ్ ఘోష్, షఫీ, అన్నపూర్ణమ్మ, ఫిష్ వెంకట్ జబర్ దస్త్ ఫణి, నాగిరెడ్డి. బస్ స్టాప్ కోటేశ్వర రావు, మాధవి, వేములూరి రాజశేఖర్, హరి తదితరులు


టెక్నికల్ టీం :

నిర్మాత:  పోత్నాక్ శ్రవణ్ కుమార్

రచన, దర్శకత్వం: అముద శ్రీనివాస్

డివోపీ: ఎంఎస్ కిరణ్ కుమార్

సంగీతం : ఎంఎల్ పి రాజా

ఆర్ఆర్ : చిన్నా

ఎడిటర్ : నందమూరి హరి

పీఆర్వో : వంశీ శేఖర్ 

Post a Comment

Previous Post Next Post