Yellamma Lyrical Video Song Launched From Bheema devarapalli Branch

 "భీమదేవరపల్లి బ్రాంచి" చిత్రంలోని ఎల్లమ్మ పాటకు సూపర్ రెస్పాన్స్

అతి త్వరలో గ్రాండ్ గా సినిమా విడుదల.




AB సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్ కలసి నిర్మించిన తాజా చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ ప్రధాన పాత్రలలో నటించారు. రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ నేత అద్దంకి దయాకర్ నటించడం విశేషం. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న

 "భీమదేవరపల్లి బ్రాంచి" ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన

"భీమదేవరపల్లి బ్రాంచి" ప్రివ్యూ షో లో సినిమా చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు. దర్శకుడి మీద ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా బాగా కుదిరిందని, తప్పకుండా హిట్ అవుతుందని ముక్తకంఠంతో చెప్పారు. ఇక ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఎల్లమ్మ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. చిత్ర నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తీ లత గౌడ్ మాట్లాడుతూ...దర్శకుడు రమేష్ చెప్పాల మంచి కథను కామెడీ వేలో చెప్పడం వల్ల జనాలకి ఈజీగా రీచ్ అవుతుందని అన్నారు.


నటీ నటులు

అంజి వల్గమాన్, సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్,సాయి ప్రసన్న, జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, అద్దంకి దయాకర్, బుర్ర శ్రీనివాస్  (బీ.ఎస్),శుభోదయం సుబ్బారావు,వివ రెడ్డి, నర్సింహ రెడ్డి,పద్మ,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత,మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, కటారి, రజిని, సుష్మా.


సాంకేతిక నిపుణులు

రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.

నిర్మాతలు: డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి.

కెమెరా: కె.చిట్టి బాబు.

సంగీతం: చరణ్ అర్జున్,

సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.

ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి.

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే.

పిఆర్ఓ: సురేశ్ కొండేటి

Post a Comment

Previous Post Next Post