Home » » Natural Star Nani Interview About Dasara

Natural Star Nani Interview About Dasara

 ‘దసరా’ మేము ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది: నేచురల్ స్టార్ నాని 



నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు.


 


దసరా విజయం ఎలా అనిపించిది ?


సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది.


 


దసరా లో చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏవి ?


దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి  చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి  మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూసాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. మీరు కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది.


 


రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో  మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా?


నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ  మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్.


 


దసరా కథ విన్నప్పుడే దసరా కి ఇంత స్పాన్ వుందని అనుకున్నారా ?


ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను.


 


మిగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు ?


కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి.


 


ఇప్పుడు మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ?


నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న . నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు.. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు.. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి.


 


దసరా కి నార్త్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంది   ?


చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది.


 


మీ గత సినిమాల విజయాలకి మాస్ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ?


ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్ బాయ్ కదా దసరా ఎలా వుంటుందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దసరా, ఎంసిఏ, నేను లోకల్. మూడు మాస్ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వున్నాను. నేను ఏది జోనర్ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను.


 


మీకు కంఫర్ట్ ఫుల్ జోనర్ ?


 ఏ  జోనర్ ని కూడా రిపీట్ చేయకపోవడాన్ని  కంఫర్ట్ బుల్ గా ఫీలౌతా. చేసింది మళ్ళీ చేయకూడదు. మళ్ళీ రెండుముడేళ్ళ తర్వాత సాలిడ్ మాస్ ఫిల్మ్ తో వస్తా. కానీ అలా చేయాలని కాదు. ఒక నటుడిగా కొత్తగా చేయాలని వుంటుంది. ఇది వర్క్ అవుట్ అవుతుందని అదే అమ్మాలని చూస్తే బిజినెస్ మెన్ అవుతాను కానీ యాక్టర్ ని కాదు కదా.

దాదాపు గా 10 మంది దర్శకులని పరిచయం చేశారు.. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత సేఫ్ గేమ్ ఆడాలని వుంటుంది కదా ?


సేఫ్ గేమ్ గొడవే మనకి లేదు ( నవ్వుతూ) కొత్త దర్శకులని పరిచయం చేయాలని ప్రత్యేకంగా ఏమీ అనుకోను. కథ నచ్చితే చేయాలనిపిస్తే చేస్తాను. అయితే సినిమాలు చేసిన అందరూ మంచి స్థానాల్లో వుండటం గర్వంగా వుంది.


నాని.. బిగోర్ దసరా ఆఫ్టర్ దసరా అంటున్నారు ?


ఇది నేను చాలా సార్లు విన్నాను.. భలే భలే మగాడివో, జెర్సీ, నిన్ను కోరి సినిమాలకి విన్నాను. ఇప్పడు దసరాకి అంటున్నారు. ఇదే మాట నేను చేసిన ప్రతి సినిమాకి వినాలని నా కోరిక (నవ్వుతూ)



దసరా చూసిన తర్వాత జున్ను రియాక్షన్ ఏమిటి ?


ఫస్ట్ డే సుదర్శన్ కి వెళ్లాం. మా నాన్న కోసం ఎందుకు అందరూ ఇలా అరుస్తున్నారని వాడికి అర్ధం కావడం లేదు.  పేపర్లు విసిరేస్తుంటే పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయని వాడి టెన్షన్. వాడికి ఇంకా ప్రపంచం తెలీదు. 


యుఎస్ లో 2 మిలియన్ కొట్టారు.. ఎలా అనిపించింది ?


అక్కడి ఆడియన్స్ ప్రేమకు కృతజ్ఞతలు. నెంబర్స్ అలా వుంచితే సినిమా రాగానే చూడాలని ఫిక్స్ అవుతున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోగలిగితే చాలు.


వీర్లపల్లి విలేజ్ గురించి ?


దర్శకుడు శ్రీకాంత్ పెరిగిన ఊరు అది. వీర్లపల్లి వరల్డ్ చాలా క్లియర్ గా వుంది. అవినాష్ కొల్లా అద్భుతంగా సెట్ వేశారు. అది సెట్ లా వుండదు. నిజమైన ఊరులానే వుంటుంది.


దసరా మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ?


నాని మంచి సినిమాలు చేస్తాడని చాలా మంది బాక్సాఫీసు సినిమాలతో పోలికలు తెస్తారు. ఇక నుంచి ఈ కంపారిజన్లు ఆగిపోతాయి. ప్రతి సినిమా ఒక టార్గెట్ వుంటుంది.  దాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రతి సినిమాని ప్రత్యేకంగా చూడాలి. 


ప్రభాస్, మహేష్.. గారు అందరూ దసరా ని మెచ్చుకుంటూ మెసేజ్ లు పెట్టడం ఎలా అనిపించింది ?


చాలా ఆనందంగా వుంది. జెర్సీ, శ్యాం సింగ రాయ్ సమయంలో కూడా చరణ్ , తారక్ , ప్రభాస్ అన్న, మహేష్ గారు, చిరంజీవి గారు.. ఇలా అందరూ మెసేజ్ చేశారు. ఇది ఆనందంతో పాటు భాద్యతని కూడా పెంచుతుంది.


ఆల్ ది బెస్ట్


థాంక్స్


Share this article :