Pulse First Look Launched

 ఆడియన్స్ "పల్స్" పట్టుకుంటారని 

గట్టిగా నమ్ముతున్నాను!!

"పల్స్" ఫస్ట్ లుక్ విడుదల వేడుకలో

సంచలన రచయిత శివశక్తి దత్తా 



ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం"పల్స్". ఈ చిత్ర ఫస్ట్ లుక్ ప్రముఖ సినీ రచయిత కె.శివశక్తి దత్తా (కీరవాణి ఫాదర్) చేతుల మీదుగా విడుదలయింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే... చిత్ర దర్శకుడు రమణ ఆడియన్స్ "పల్స్" కచ్చితంగా పట్టుకుంటాడనే నమ్మకం కలిగింది. చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్" అన్నారు. దిలీప్ కుమార్ మల్లా-రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చారు. దర్శకనిర్మాత రమణ తూముల మాట్లాడుతూ..."యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది" అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: చందు ఏజే, ఎడిటింగ్. ఉదయ్ చైతన్య (బాబి)!!

Post a Comment

Previous Post Next Post