గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ఇటీవల తెలుగు సినిమా రేంజ్‌లో ప్రపంచానికి తెలియజేస్తూ ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి సహా ఎంటైర్ యూనిట్‌ను అందరూ ప్రశంసించారు. ఈ అవార్డుల ఫంక్షన్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ తరుణంలో అభిమానులు, ప్రేక్షకులు రెడ్ కార్పెట్‌పై మన సెలబ్రిటీలు ఎంత స్టైలిష్ లుక్స్‌తో మెప్పించారనే విషయాన్ని ఆసక్తిగా గమనించారు.
ఇండియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలాని డిజైన్ చేసిన క్లాసిక్ డ్రెస్‌ను ధరించి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో మన ఇండియన్ స్టైల్‌ను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లారు రామ్ చరణ్. ఆ రెడ్ కార్పెట్‌పై ఫ్యాషన్ ఐకాన్‌గా తనదైన గుర్తింపును దక్కించుకున్నారు.
గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్స్ ఫంక్షన్‌లో వరుణ్ తేజ్ డ్రెస్సింగ్ స్టైల్ అందరినీ ఆకట్టుకోవటమే కాదు.. బెస్ట్ లిస్ట్ డ్రెస్డ్ లిస్ట్‌లోనూ చేరారు. ఈ లిస్టుకి ఎంపికైన ఇండియన్ నటీనటుల లిస్టులో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం. రామ్ చరణ్ అద్భుతమైన నటుడే కాదు.. ఆయన ఫ్యాషన్, స్టైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఈ కారణంగా ఆయన రిహానా, అండ్రూ గ్యారీ ఫీల్డ్, బిల్లీ పోర్టర్, జెరెమీ పోప్, పెర్సీ హైన్స్, జెన్నా ఓర్టెగా, మిచెల్లె యోహ్, మిచెల్లె జె రోడ్రిగ్, ఎమ్మా డి ఆర్సీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీల లిస్టులో రామ్ చరణ్ చేరారు.
Post a Comment