క్రైమ్ డ్రామాగా ఆకట్టుకునే జగమే మాయ, ఈ నెల 15 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్
స్టార్ లో స్ట్రీమింగ్
ధన్య బాలకృష్ణన్, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో
నటించిన సినిమా జగమే మాయ. ఇన్ స్టంట్ కర్మ అనేది ట్యాగ్ లైన్. ఈ
చిత్రాన్ని జ్యాపీ స్టూడియోస్ పతాకంపై ఉదయ్ కిరణ్ కోలా, విజయ్ శేఖర్
అన్నే నిర్మించారు. క్రైమ్ డ్రామా కథతో దర్శకుడు సునీల్ పుప్పాల ఈ
చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్
స్టార్ లో జగమేమాయ స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర
ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో
హీరోయిన్ ధన్య బాలకృష్ణన్ మాట్లాడుతూ...ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా మీద
వెళ్లే సినిమా ఇది. మనలో ఎవరూ బ్లాక్ అండ్ వైట్ లాంటి వ్యక్తిత్వం కలిగి
ఉండరు. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయని చెప్పే కథ ఇది. దర్శకుడు సునీల్
నాకు కథ చెప్పినప్పుడు మీ కళ్లతోనే నటించాల్సి ఉంటుంది అన్నారు. ఆ
పాత్రలోని ఇంటెన్సిటి అప్పుడే అర్థమైంది. నేను బాగా నటించానని
అనుకుంటున్నాను. అని చెప్పింది.
తేజ ఐనంపూడి మాట్లాడుతూ...మీకొక మంచి సినిమా చూపించామని ఆశిస్తున్నాము.
జీవితంలో మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే..ఆ బ్యాడ్ మనకే జరుగుతుంది అని
చెప్పే చిత్రమిది. నాకు ఇలాంటి మంచి రోల్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు
థాంక్స్. అన్నారు.
సంగీత దర్శకుడు అజయ్ అరసాడ మాట్లాడుతూ...ఈ సినిమా చూసినప్పుడు నటీనటుల
పర్మార్మెన్స్ గురించి చెప్పాలనిపించింది. తేజ, ధన్య బాగా నటించారు.
మ్యూజిక్ కు స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
అన్నారు.
దర్శకుడు సునీల్ పుప్పాల మాట్లాడుతూ...అందరి సహకారంతో ఇవాళ మీ ముందుకు మా
సినిమాను తీసుకొస్తున్నాం. కథ చెప్పగానే మా ప్రొడ్యూసర్ ఏ ప్రశ్నలు
లేకుండా బడ్జెట్ ఎంత అన్నారు. అంతగా స్క్రిప్ట్ ను నమ్మారు. నటీనటులు
ఎన్ని టేక్స్ చెప్పినా చేసేవారు. ఒక ఫ్రెండ్స్ లా చిత్రాన్ని కంప్లీట్
చేశాం. అయితే ఫుల్ క్రెడిట్ మాత్రం ప్రొడ్యూసర్స్ కు ఇస్తాను. అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ...మా సంస్థలో ఓటీటీ ప్రాజెక్ట్స్ చేద్దామా,
సినిమాలు చేయాలా అని కొంత వర్క్ చేశాం. జగమేమాయ చిత్రాన్ని జూలైలో
ప్రారంభించాం. అప్పుడు ఇండస్ట్రీలోని కొందరు మిత్రుల సలహాలు తీసుకున్నాం.
మొత్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం. డిస్నీ ప్లస్ హాట్
స్టార్ లో మా సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.
మేకా రామకృష్ణ, బీహెచ్ఈఎల్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, సుజన కందుకూరి,
జ్యోతి, కేశవ్ దీపక్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ - రాహుల్ మాచినేని, సంగీతం - అజయ్ అరసాడ, ఎడిటింగ్ -
సాగర్, మధు రెడ్డి, స్క్రీన్ ప్లే, అడిషనల్ డైలాగ్స్ - అజయ్ శరణ్ అడ్డాల,
పీఆర్వో - జీఎస్కే మీడియా.
Post a Comment