Tremendous Response for Kantara Solid Collections All Over

 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న 'కాంతార'..



కంటెంట్ ఈజ్ కింగ్.. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది కాంతార సినిమా. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా భూత కోలా సాంప్రదాయం గురించి కాంతార సినిమాలో రిషబ్ చూపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. లీడ్ పెయిర్ నటన.. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ యాక్టింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక టెక్నికల్ టీమ్ అయితే కాంతారకు ప్రాణం పోశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు నుంచి కాంతార సినిమా సంచలనాలు మొదలయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది ఈ సినిమా. అద్భుతమైన కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు అని చెప్పడానికి కాంతార కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి లేదు. గీత ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ విడుదల చేసిన ఈ సినిమా రోజురోజుకు అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది.

Post a Comment

Previous Post Next Post