TFPC Pressnote Regarding Recent Hits

 ప్రెస్ నోట్

ది: 16.08.2022




ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా నిర్మాతలు శ్రీ టి.ఎస్. విశ్వ ప్రసాద్, శ్రీ కె.ఎస్. వివేకానంద, శ్రీ అభిషేక్ అగర్వాల్, శ్రీ మయాంక్ సింఘానియా, శ్రీ తేజ్ నారాయణ్ అగర్వాల్, దర్శకుడు శ్రీ చందు మొండేటి దర్శకత్వంలో నిర్మించిన కార్తికేయ-2 సినిమా 13.8.2022 న రిలీజ్ అయి  అఖండ విజయం సాధించింది.

ప్రస్తుతం, తెలుగు సినిమా పరిశ్రమ కష్టకాలం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో "బింబిసార " మరియు "సీతారామం" సినిమాలతో బాటు  "కార్తికేయ-2" సినిమా విజయపదంలో దూసుకుపోతుంది. దర్శకుడు చందు మొండేటి ప్రతిభతో బాటు  హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటనను ప్రేక్షకులు కొనియాడుతున్నారు. చిత్ర ప్రమోషన్ విషయంలో హీరో నిఖిల్ చూపిన ప్రత్యేక శ్రద్ధను అభినందిస్తూ, భవిషత్తులో మిగితా హీరో, హీరోయిన్లు కూడా ప్రమోషన్ విషయంలో ఆ విధంగా సహకరించాలని హీరో నిఖిల్ గారికి వారి టీంకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము.  

ప్రేక్షక ఆదరణ పొందుతున్న పాన్-ఇండియా సినిమాగా "కార్తికేయ-2"  నిర్మాతలకు, దర్శకుడికి, నటీనటులకు, మరియు చిత్ర యూనిట్ మెంబెర్స్ అందరికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని ఇలాంటి చిత్రాలు నిర్మించాలని ఆకాంక్ష వ్యక్తపరిచారు.  

ఇట్లు

(శ్రీ ప్రసన్న కుమార్) (శ్రీ మోహన్ వడ్లపట్ల)

గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి


Post a Comment

Previous Post Next Post