ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదలవుతున్న ధ్రువ సర్జా - రచితా రామ్ హరిప్రియల "పుష్పరాజ్"
కృషికి పట్టుదలకు నిలువెత్తు రూపమే "బొడ్డు అశోక్" అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలను కను.. వాటిని నిజం చేసుకో అన్న మాటలను అక్షరాల పాటిస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రియల్ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రతి రంగంలో సక్సెస్ సాధించిన బొడ్డు అశోక్ సినిమారంగంలో కూడా తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా అడుగు పెట్టి ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడ లో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారద్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్దమైంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ..
"భార్జరీ " సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టిన అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము.ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప" సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో..ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆగస్టు 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మా చిత్రాన్ని సక్సస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
నటీ నటులు
ధ్రువ సర్జా - రచితా రామ్ హరిప్రియ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్
నిర్మాతలు : బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్
దర్శకత్వం : చేతన్ కుమార్
సంగీతం : హరికృష్ణ
డి. ఓ. పి : శ్రేయ కొడువల్లి
పి. ఆర్. ఓ : మధు వి.ఆర్