Natural Star Nani Launched Masooda Teaser

 న్యాచురల్ స్టార్ నాని ఆవిష్కరించిన ‘మసూద’ టీజర్



‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. మంగళవారం న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి.. టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, టీజర్ చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా.. అని అనిపిస్తుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా..  హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌ల్లన్ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన న్యాచురల్ స్టార్ నాని గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు.


సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

ఆర్ట్: క్రాంతి ప్రియం

కెమెరా: నగేష్ బనెల్

స్టంట్స్: రామ్ కిషన్ అండ్ స్టంట్ జాషువా

సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి

ఎడిటింగ్: జెశ్విన్ ప్రభు

పీఆర్వో: బి. వీరబాబు

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా

రచన, దర్శకత్వం: సాయికిరణ్

Post a Comment

Previous Post Next Post