Home » » Ramarao On Duty Pre Release Event Held Grandly

Ramarao On Duty Pre Release Event Held Grandly

'రామారావు ఆన్ డ్యూటీ' నాకు చాలా డిఫరెంట్ మూవీ: 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజమాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు కానుంది. వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. విజయవంతంగా జరిగిన వేడుకకు నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకుడు బాబీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.  రవితేజ, శరత్ మండవ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి,  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, అన్వేషి జైన్, సామ్ సిఎస్, సత్యన్ సూర్యన్, ప్రవీణ్ , కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రవితేజ మాట్లాడుతూ.. 'రామారావు ఆన్ డ్యూటీ' నాకు చాలా డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఇంతకుముందు ఎప్పుడూ చేయనిది. దర్శకుడు శరత్ చాలా అద్భుతమైన సినిమా తీశాడు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. కూల్, పాజిటివ్ పర్శన్. అలాంటి వారితో ఎన్ని సినిమాలైన చేయడానికి నేను రెడీ. సుధాకర్, శ్రీకాంత్ లకు అల్ ది బెస్ట్. ఈవెంట్ కి వచ్చిన దర్శకుడు బాబీకి థాంక్స్. నాని అంటే నాకు చాలా ఇష్టం. సౌత్ ఇండియాలోనే నాని మంచి నటుడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ లు బ్యూటీఫుల్ గా వుంటారు. సీసా పాటలో అన్వేషి జైన్ అలరిస్తుంది. ఈ పాట చాలా బాగా వచ్చింది. వేణు తొట్టెంపూడితో నేను స్వయంవరం సినిమా చేయాలి. కానీ మిస్ అయ్యింది. మళ్ళీ కలిశాం. ఇంక గ్యాప్ ఇవ్వద్దు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ 95 లుక్ ని అద్భుతంగా తీసుకొచ్చారు.  ఎడిటర్ ప్రవీణ్ మంచి వర్క్ ఇచ్చారు. డివోపీ సత్యన్ సూర్యన్ వండర్ ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఆయనతో మళ్ళీ పని చేయాలనీ వుంది. ఈ సినిమాకి సౌండ్ చాలా ముఖ్యం. దీనికి వందశాతం న్యాయం చేశాడు సామ్ సిఎస్. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫైట్ మాస్టర్ స్టంట్ శివ, కెవిన్ సూపర్ గా యాక్షన్ డిజైన్ చేశారు. జులై 29న 'రామారావు ఆన్ డ్యూటీ థియేటర్ కి వస్తుంది, అంతా థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. రవితేజ గారు చిరంజీవి గారిని ఇన్స్ ప్రేషన్ గా తీసుకున్నారు. మేము కెరీర్ మొదలుపెట్టినపుడు రవితేజ గారు మాకు ఇన్స్ ప్రేషన్.  చిరంజీవి గారి కార్వాన్ లోకి రవితేజ గారు ఎంటర్ అవ్వడం చూసినపుడు.. రవితేజ కార్వాన్ లోకి త్వరలోనే నేను ఎంటరవ్వాలనిపించింది. రవితేజ గారి మాటల్లో ఎంతో ప్రేమ వుంటుంది. సినిమా బావుంటే ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తారు. 'రామారావు ఆన్ డ్యూటీ' కి చాలా పాజిటివ్ వైబ్ వుంది. నా 'దసరా' సినిమా చేస్తున్న నిర్మాతలే ఈ సినిమా చేస్తున్నారు. బాక్సాఫీసు సక్సెస్ తో పాటు మంచి కంటెంట్ వుండే సినిమా ఇవ్వాలనే తపన మా నిర్మాతల్లో వుంది. ఈ సినిమా అన్నీ ఎలిమెంట్స్ వున్న కాంబినేషన్ అనిపిస్తుంది. వేణు ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టడం ఆనందంగా వుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఇరవై ఏళ్ల నుండి రవితేజ ఆన్ డ్యూటీ. 29 నుండి రామారావు ఆన్ డ్యూటీ'' అన్నారు.


దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ.. ఒక మంచి మనిషిగా రవితేజ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన వలనే 'రామారావు ఆన్ డ్యూటీ' సాధ్యమైయింది. ట్రైలర్ ఎంత బావుందో అంతకంటే గొప్పగా సినిమా వుంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' చాలా యునిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ధరలు ఎక్కువగా వుండటం వలన ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదని కొందరు చెబుతున్నారు.  'రామారావు ఆన్ డ్యూటీ' టికెట్లు సాధారణ ధరలకే అందుబాటులో వుంటాయి. తెలంగాణలోని  మల్టీ ఫ్లెక్స్ లో 195, సింగెల్ స్క్రీన్స్ లో 150, 100, 50 రూపాయిలు. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ప్రభుత్వం చేతిలో వుంటాయి. అక్కడ 177, 147, 80 రూపాయిలుగా టికెట్ ధరలు వున్నాయి. ఈ ఈవెంట్ కి విచ్చేసిన నాని గారికి, బాబీ గారికి కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి టెక్నిషియన్ కృతజ్ఞతలు. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ డివోపీ సత్యన్ సూర్య, మిగతా టెక్నిషియన్స్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. సామ్ సిఎస్ చెవుల్లో తుప్పు వదిలిపోయే ఆర్ఆర్ ఇచ్చారు. దర్శకత్వ విభాగంలో పని చేసి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. మీరంతా తప్పకుండా థియేటర్లో సినిమా చూడాలి'' అని కోరారు.


దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడు శరత్ మండవ నాకు ఎప్పటినుండో తెలుసు. ట్రైలర్ చుసిన తర్వాత రెగ్యులర్ మాస్ సినిమాలా కాకుండా ఒక కాన్సెప్ట్ సినిమాగా చేశారనిపించింది. సంగీత దర్శకుడు సామ్ సిఎస్ డివోపీ సత్యన్ సూర్య, మిగతా టెక్నిషియన్స్ అద్భుతమైన వర్క్ చేశారు. రవితేజగారు తన డ్యూటీ సరిగ్గా చేశారు. మనం కూడా 29న థియేటర్లో సినిమా చూసి మన డ్యూటీ చేద్దాం. మాస్ మహారాజాని పట్టుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మాలాంటి వాళ్ళ స్థాయి రేంజ్ రోవర్ వరకూ సెట్ అయిపోతుంది.  దానికి నేనే పెద్ద ఉదాహరణ, 'బలుపు' సినిమాకి  ముందు వరకు ఒకలా వుండేది జీవితం. తర్వాత ఆయనకి కథ చెప్పిన తర్వాత మరో లా వుంది. పవన్ కళ్యాణ్ గారితో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. రవితేజ గారు ఫోన్ చేసిన అబ్బాయి కథ చెప్తావా.. నన్ను సెట్ చేయమంటావా ? అని అన్నారు. సెట్ చేయడమే కాదు రిసెట్ చేస్తుంటారాయన. సర్దార్ తర్వాత రవితేజ గారితో సినిమా చేయాలి. కానీ ఎన్టీఆర్ గారితో సినిమా కుదిరింది. రవితేజ గారు చాలా గొప్ప మనసుతో ''ముందు ఎన్టీఆర్ సినిమా చేయ్. ఎన్టీఆర్ చాలా అద్భుతమైన నటుడు. నీ లైఫ్ ఇంకా స్పీడ్ అవుతుంది'' అని  చెప్పారు. అది ఆయనలోని గొప్పదనం. నా డ్రీం ప్రాజెక్ట్ మెగా 154 కి కథ చెప్పగానే రవితేజ గారు అంగీకరించి జాయిన్ అయ్యారు. మెగా 154లో రవితేజ గారిది షాలిడ్ క్యారెక్టర్. రవితేజ గారి ఫ్యాన్స్ విజల్స్ వేనుసుకునేలా వుంటుంది'' అన్నారు.


వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ.. నా మిత్రుడు రవితేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నా పై నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చిన సుధాకర్, శ్రీకాంత్ గారికి, దర్శకుడు శరత్ మండవ గారికి థాంక్స్.  ఈ సినిమా యూనిట్ అందరికీ  అల్ ది బెస్ట్. 29న అందరం మన అభిమాన థియేటర్లోకి వెళ్లి ఈ సినిమాని సక్సెస్ చేద్దాం''అన్నారు.


రజిషా విజయన్ మాట్లాడుతూ..   'రామారావు ఆన్ డ్యూటీ' తో తెలుగులో అడుగుపెట్టడం ఆనందంగా వుంది. మాళిని లాంటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శరత్ గారికి, నిర్మాత సుధాకర్ గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు గ్రేట్ కోస్టార్.  29న సినిమా థియేటర్ కి వస్తుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.


దివ్యాంశ కౌశిక్ .. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారి సినిమాలో చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. 29న మీ ముందుకు వస్తుంది. అందరూ థియేటర్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను.


అన్వేషి జైన్ మాట్లాడుతూ.. 'సీసా' పాట మీ అందరికీ నచ్చడం ఆనందాన్ని ఇచ్చింది, ఈ అవకాశం ఇచ్చిన రవితేజ, శరత్, నిర్మాతలకు థాంక్స్. 29న సినిమా థియేటర్ లోకి వస్తుంది. అందరం థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.  


సంగీత దర్శకుడు సామ్ సిఎస్ మాట్లాడుతూ..  'రామారావు ఆన్ డ్యూటీ' అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లేయ్. ఈ కథకి సంగీత ప్రాధన్యత కూడా వుంది. మ్యజికల్ గా నా బెస్ట్ ఇచ్చాను. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.  ఇంత మంచి సినిమా ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు అద్భుతమైన మనిషి, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.


డివోపీ సత్యన్ సూర్యన్ మాట్లాడుతూ... రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు. 'రామారావు ఆన్ డ్యూటీ' అద్భుతంగా వుంటుంది. రవితేజ గారు బ్రిలియంట్ గా కనిపిస్తారు. ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.


ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడుతూ.. రవితేజ, దర్శకుడు శరత్ మండవ, నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి కృతజ్ఞతలు.  రామారావు ఆన్ డ్యూటీ 29 న విడుదల కాబోతుంది. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. ఇందులో సందేహం లేదు'' అన్నారు.


గేయ రచయిత కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో రెండు మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన రవితేజ, దర్శకుడు శరత్ మండవ గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు నిర్మలమైన మహానది లాంటి మనిషి. ఎంతో మంది రచయితలకు, దర్శకులకు  అవకాశాలు కల్పించారు. 29 రామారావు ఆన్ డ్యూటీ. టోటల్ ఏపీ తెలంగాణ ఆన్ డ్యూటీ'' అన్నారు.


ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ మాట్లాడుతూ.. ట్రైలర్ ఎంత అద్భుతంగా వుందో సినిమా అంతకంటే అద్భుతంగా వుంటుంది. రవితేజ, శరత్, నిర్మాతలకు థాంక్స్. అవుట్ పుట్ అద్భుతంగా  బావోచ్చింది. మా అందరికీ నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.


స్టంట్ మాస్టర్ శివ మాట్లాడుతూ.. రవితేజ గారితో ఇది మా ఐదో సినిమా. ఇందులో అద్భుతమైన యాక్షన్ వుంది.  రోడ్ జంక్షన్ లో వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ ఎక్స్ టార్డినరీగా వుంటుంది. తన మొదటి సినిమాకి ఇప్పటికి రవితేజ గారి ఎనర్జీలో ఎలాంటి మార్పు లేదు. దర్శకుడు శరత్ మాండవ గారు అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన కథని చూపించబోతున్నారు. మాకు చాలా స్వేఛ్చని ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సినిమా చాలా అద్భుతంగా వుంటుంది'' అన్నారు.


Share this article :