త్రిగున్ బర్త్ డే సందర్బంగా "కిరాయి" ఫస్ట్ లుక్ & టైటిల్ ను లాంచ్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్
చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, రీసెంట్ గా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న "కొండ" చిత్రాలలో హీరోగా హీరోగా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు త్రిగున్.తను తాజాగా నటిస్తున్న చిత్రం "కిరాయి".SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకంపై త్రిగున్ ప్రధాన హీరోగా V . R. K, దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "కిరాయి".గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 1995 2003, 2020 లలో గుంటూరు, పల్నాడు లలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకేక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ "కిరాయి" చిత్రంలోని రస్టిక్, రగ్గడ్ గా ఉండే ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..త్రిగున్ నాకు చాలా కాలం నుండి తెలుసు. తను చాలా ఎనర్జీటిక్ హీరో గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు.ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూశాను చాలా బాగుంది. తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అట్టెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. గుంటూరు, పల్నాడు లో ఒకప్పుడు ఎక్కువగా హత్యలు జరిగేవి.దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది.అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. ఇందులో హీరోగా నటించిన త్రిగున్ కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రష్ & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ గారు చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకు మంచి టెక్నిసియన్స్ తో పాటు చక్కని ప్యాడింగ్ మంచి రోల్స్ లో నటిస్తున్నారు. ఇది యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా ఎదో రెండు ఫైట్స్ పెట్టి చుట్టేసే సినిమా కాదు. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో ఆలా హెవీ యాక్షన్ తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అన్నారు.
చిత్ర నిర్మాత అమూల్య రెడ్డి యలమూరి మాట్లాడుతూ.. ఈ సినిమా కొరకు గుంటూరు సబ్ జైల్లో, చంచల్ గూడ, చర్లపల్లి జైల్లల్లో కిరాయి హత్యలు చేసే వారి గురించి director రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, భాధలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయని తెలుసు కొన్నాము. "కిరాయి" టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ హరీష్ శంకర్ గారికి వర్మ గారికి బాగా నచ్చాయని చెప్పారు.
మరో నిర్మాత నవీన్ రెడ్డి వుయ్యూరు మాట్లాడుతూ..హై వోల్టేజ్ యాక్షన్ మూవీ లా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.మా చిత్ర హీరో త్రిగున్ గారి బర్త్ డే అయినందున ఈరోజు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు రస్టిక్, రగ్గడ్ గా ఉండే టైటిల్ ను రిలీజ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.
నటీ నటులు
హీరో: త్రిగుణ్ (కొండ ఫేమ్),
సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ : : సే క్రియేషన్స్,ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్
టైటిల్ : కిరాయి,
నిర్మాతలు : అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు
సహ నిర్మాతలు. బి. గురువరావు, పి. సీతారాం,
దర్శకుడు: V . R. K,
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
డి ఓపి . సుజాత సిద్ధార్థ్,
రి రికార్డింగ్. ఓషో వెంకట్,
సంగీతం. హరి గౌర,
డైలాగ్స్. భరత్ కుమార్ పోగుల,
సాహిత్యం. రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్.
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్
Post a Comment