ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు చక్కటి ఫీల్‌గుడ్ కలిగించే చిత్రమే `సదా నన్ను నడిపే` - హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్
`వానవిల్లు` చిత్రం తర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటించిన చిత్రం `సదా నన్ను నడిపే`. వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డిఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమా జూన్ 24న విడుదలకాబోతుంది. ఈ చిత్రానికి హీరో, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం వంటి బాధ్యతలను ప్రతీక్ ప్రేమ్ కరణ్ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ప్రతీక్ మంగళవారంనాడు ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమాదేశంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు.
- నేను చేసిన `వానవిల్లు` 2017లో విడుదలయింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమపై పూర్తి అవగాహన వచ్చింది. దానిలో కొన్ని సాధకబాధలు గ్రహించాను. ఆ తర్వాత మరో చిత్రం చేయాలని `సదా నన్ను నడిపే` తెరకెక్కించాను.
- అయితే ఈ సినిమా మొదలు పెట్టాక కోవిడ్ సమస్య రావడంతో షూటింగ్‌లో రెండేళ్ళ జాప్యం జరిగింది. మాది విజయవాడ. బిటెక్ చదివాను. సినిమా అంటే పిచ్చితో ఈ రంగంలోకి వచ్చాను. దర్శకుడు అవ్వాలన్నదే నా ఎయిమ్. అనుకోని పరిస్థితిలో నేనే హీరోగా మారిపోయాను. దానితోపాటు నేపథ్య సంగీతం కూడా నేనే చేశాను. ఇలా అన్ని కార్యక్రమాలు ముగించుకుని జూన్ 24న థియేటర్‌కు రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
- కథగా చెప్పాలంటే ఎమోషనల్ లవ్‌స్టోరీ. కలిసుందాంరా, గీతాంజలి తరహాలో మంచి ఫీల్ కనిపిస్తుంది. లహరి ఆడియోద్వారా పాటలు విడుదలయ్యాయి. నందు ఫైట్స్ చేశారు. షూటింగ్ విజయవాడ, హైదరాబాద్, కొడైకెనాల్, కులుమనాలిలో తీశాం. మా ట్రైలర్ విడుదలయి 3 మిలియన్ వ్యూస్ చేరింది. మంచి బజ్ వచ్చింది.
- ఇది ప్యూర్ లవ్‌స్టోరీ. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నాడని తెలిశాక వారితో వున్న కొద్దిక్షణాలు ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించాం. ఇందులో ఎమోషన్‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. తొమ్మిది సంవత్సరాలు స్ట్రగుల్ అయిన నాకు ఇది ప్రత్యేకమైన సినిమా.
- అయితే ఎమోషనల్ లవ్‌స్టోరీలు చాలా వచ్చాయి. గీతాంజలి వచ్చింది. ఈ కథ చెప్పినప్పుడు చాలామంది ఇదే అన్నారు. ట్రైలర్‌లో కూడా అదేచెప్పేశారు కదా అన్నారు. కానీ అందరికీ తెలియని సస్పెన్స్ పాయింట్ ఇందులో వుంది. అది చెప్పలేదు. చూసిన ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీలవుతాడు. కథ చెప్పినా ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకం నాకు వుంది.
- ఇది ఓ వాస్తవ కథ. కర్నాటకలో జరిగింది. చిన్న అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చాను. ఒకవేళ ఆ సంఘటన ఇలా జరిగివుంటే ఎలా వుంటుందనేది ఆసక్తిగా చెప్పాను.
- నా మొదటి సినిమా వానవిల్లు బాగుందనే పేరు వచ్చింది. కానీ వ్యాపారపరంగా కొన్ని తప్పిదాలు చేయడంతో దాన్ని ఈ సినిమాకు మార్చుకున్నాను. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ సినిమా చేశాను.
-ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం కేటాయించాను. సినిమా చూడకుముందు అంతా అర్జున్‌రెడ్డి, గీతాంజలి తరహా అన్నారు. సెన్సార్ అయ్యాక వారు కూడా బెస్ట్ ఎమోషన్ ఫిలిం అని కితాబిచ్చారు. చివరి 25 నిముషాలు బాగా ఇన్‌వాల్వ్ చేశారని ప్రశంసించారు.
- నేనే సంగీతం చేయడానికి కారణం మాకుటుంబంలోని వారంతా సంగీత విద్వాంసులే. అలా నాకు అబ్బింది. బయట సంగీత దర్శకుడు అయితే నేను చెప్పే సూచనలు పాటించకపోవచ్చు. అందుకే నేనే చేశా. ఇప్పటికే ఇందులో పాటలకు మంచి ఆదరణలభించింది. కొందరైతే ఆర్.ఆర్. బాగుంది ఎవరు చేశారని అడిగారు. నేనే అనిచెప్పగానే ఆశ్చర్యపోయారు.
- దర్శకుడి కావాలన్నదే నా కోరిక. అనుకోకుండా హీరో అయ్యాను. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కథ రెడీగా వుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.