Home » » Ante Sundaraniki Pre Release Event Held Grandly

Ante Sundaraniki Pre Release Event Held Grandly

''అంటే సుందరానికీ' ఘన విజయం సాధించాలి: ''అంటే సుందరానికీ'  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్



నాని గారి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో గౌరవం. నాని గారు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. 'అంటే సుందరానికీ' ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.


నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌ టైనర్ 'అంటే సుందరానికీ'. జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా పేక్షకుల ముందుకు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు దర్శకుడు సుకుమార్, గోపి చంద్ మలినేని, హరీష్ శంకర్, బుచ్చిబాబు,  హీరోయిన్ నివేదా థామస్ తదితరులు పాల్గొన్నారు.


 


ఈ సందర్భం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన ప్రేక్షకులకు అభిమానులు కృతజ్ఞతలు. అభిమానులు ఉత్సాహం లేకపోతే ఇలాంటి వేడుకకి అందం వుండదు. 'అంటే సుందరానికీ' వేడుకకి ఆహ్వానించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు. నాని గారి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో గౌరవం. నాని గారు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయనికి భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన నజ్రియా గారిని తెలుగు చిత్ర పరిశ్రమ కి మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. సినిమాకి వెన్నెముక లాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్పూర్తిగా అభినందనలు. ఈ సినిమాని నేనూ చూడాలని ఆశిస్తున్నా.


నరేష్ గారు, ఆయన నటన అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే రోహిణి గారికి, మేడం నదియా గారికి అభినందనలు. ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక విభాగం అంతటికీ నా అభినందనలు. మంచి సంగీతం అందించిన వివేక్ సాగర్ కి అభినందనలు.  ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కరి సొత్తుకాదు అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడే ధైర్యం అభిమానులు. ప్రేక్షకులు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది. రాజకీయంగా భిన్నమైన ఆలోచనలు వున్నప్పటికీ సినిమా వేరు రాజకీయం వేరు. కళకి కులం మతం ప్రాంతాలు వుండవు. కేరళ నుండి వచ్చిన నజ్రియా గారు, ముంబై నుండి వచ్చిన నదియా గారు.. ఇలా విభిన్నమైన ప్రాంతాలు నుండి వచ్చిన కళాకారులంతా కలసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఇంత మంది కలిస్తేనే ఇంతమందిని అలరించగలం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ అంటే అపారమైన గౌరవం. ఇంతగొప్ప పరిశ్రమకి మోకరిల్లుతూ.. అంటే సుందరానికీ ఘన విజయం సాధించి, అందరిమెప్పు పొందాలని కోరుకుంటున్నాను. నానిగారికి మా ఇంట్లో కూడా చాలా మంది అభిమానులు వున్నారు. విలక్షణ నటుడు నాని. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన మరిన్ని ఘన విజయాలు సాధించాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయబోతున్నాం. అంటే సుందరానికీ అద్భుతమైన విజయం సాధించాలని మరోసారి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.


హీరో నాని మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నా. అందరి హీరోలని కలిశా. కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఎప్పుడూ రాలేదు. మిగతా అందరి విషయంలో నాకు ఈ మధ్యే పరిచయం వున్న ఫీలింగ్ కాని ఎప్పుడూ కలవని కళ్యాణ్ గారు మాత్రం చిన్నప్పటి నుండే పరిచయం వున్న ఫీలింగ్. ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది. పవన్ కళ్యాణ్  విషెస్ తో అంటే సుందరానికీ విడుదల కావడం ఆనందంగా వుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాటతో నా కడుపు నిండిపోయింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ, మా నిర్మాతలు, మిగతా నటినటులు,  డీవోపీ నికేత్, ఎడిటర్ రవితేజ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, లతా నాయుడు ..ఇలా అంతా ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే.. మా టీం మొత్తానికి తిక్క వుంది కానీ దానికో లెక్కుంది. ఈ లెక్క సినిమా చూశాక అర్ధమౌతుంది. ఈ సినిమా విషయంలో చాలా గర్వంగా వుంది. ఈ సినిమాకి వర్క్ చేసినప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేశామో.. సినిమా చూసి మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తే దానికి మించినది ఏమీ లేదు. కళ్యాణ్ గారు రావడం , అభిమానుల ఎనర్జీ అంతా ఫుల్ పాజిటీవ్ గా వుంది. అప్పుడే ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వైబ్ మొదలైయింది. ఈ వేడుకకి వచ్చిన నివేతా థామస్ కి థాంక్స్. ఈ సినిమా కోసం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా ఒక టీంగా పని చేశాం. ఇలాంటి సినిమాలు గెలవాలి. తప్పకుండా గెలుస్తామనే నమ్మకం వుంది. అంటే సుందరానికీ ఇట్స్ నాట్ ఎంటర్ టైన్మెంట్ .. ఇట్స్ ఎంజాయ్ మెంట్. అందరం థియేటర్ లో కలుద్దాం'' అన్నారు.

హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఎదుట నిలుచుని మాట్లాడటం ఆనందంగా వుంది.  అంటే సుందరానికీ లాంటి మంచి కథని ప్రేక్షకులకు చూపిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారికి కృతజ్ఞతలు. నికేత్ , లతా , పల్లవి,.. టెక్నికల్ టీం అంతటికి థాంక్స్. నదియా, నరేష్ గారి లాంటి అనుభవం వున్న నటులులతో పని చేయడం గొప్ప అనుభవం. నాని గారు గ్రేట్ కో స్టార్. నాని నుండి చాలా నేర్చుకున్నా. ఇంతమంచి సినిమాలో భాగం చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయకి థాంక్స్. లీలా థామస్ లాంటి మంచి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా వుంది. నా పై ఇంత అభిమానం కురిపిస్తున్న అభిమానులకి కృతజ్ఞతలు. అంటే సుందరానికీ మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్ లో కలుద్దాం'' అన్నారు .

చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ కాపీ అందరం మా టీం అంతా చూసి ఎంజాయ్ చేశాం. సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకోవాలనేది అలోచించాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని మా నిర్మాత రవిగారు చెప్పారు. కళ్యాణ్ గారు రావడం కంటే సెలబ్రేషన్స్  ఏముంటాయి. ఈ వేడుకకి కళ్యాణ్ గారు రావడం ఆనందంగా వుంది. ఈ సినిమాకి నా డైరెక్షన్ టీం అంతా రాత్రి పగలు తేడా లేకుండా పని చేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నా జాబ్ వదిలేసి సినిమాలకి వచ్చినపుడు నేను ఏదైనా సాధిస్తానని  గర్వంగా ఫీలయ్యా.. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు మళ్ళీ గర్వంగా అనిపించింది. ఇలాంటి తారాగణం, టెక్నికల్ టీం తో పనిచేసినందుకు గర్వంగా ఫీలయ్యాను. నాని గారికి స్పెషల్ థాంక్స్. ఆయన స్క్రిప్ట్ ఓకే చేయకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు. నజ్రియా గారికి కూడా థాంక్స్. నదియా, నరేష్ , రోహిణి గారు అందరికీ  థాంక్స్. నికేత్ బొమ్మి, రవితేజ, లతా నాయుడు .. నా టెక్నికల్ టీం అంతటికి థాంక్స్. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం చక్కగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతె ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. కళ్యాణ్ గారి గురించి ఒక  విషయం చెప్పాలి. చిన్నపుడు మా అమ్మగారి ఊరుకు వెళ్ళా. లాక్ డౌన్ పెట్టినట్లు ఆ రోజు రోడ్లన్నీ ఖాళీ. కారణం తొలిప్రేమ సినిమా టీవీలో ఫస్ట్ టైం వచ్చింది. కళ్యాణ్ గారు ఫినామినా. అంటే సుందరానికీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..  మా అభ్యర్థన మేరకు ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి బిగ్ థాంక్స్.  నానిగారితో ఇది మా రెండో సినిమా. ఇంక చాలా సినిమాలు చేయాలి. నజ్రియా గారికి తెలుగు పరిశ్రమలోకి స్వాగతం.  నాని, నజ్రియా ఫెర్ ఫార్మెన్స్ అద్భుతం. అంటే సుందరానికీ ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.  టీం అంతటికి కృతజ్ఞతలు. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది.'' అన్నారు


దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ గారు రావడం ఆనందంగా వుంది. మా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా చూడమంటే చూశాను. దర్శకుడు వివేక్ ఆత్రేయ అక్కడే వున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా చూసి..  పర్లేదు కొత్త కుర్రాడు బాగానే తీశాడని అనుకున్నా. సెకండ్ హాఫ్ చూడటం మొదలుపెట్టెసరికి నా ఈగో బరస్ట్ అయ్యింది. ఇంత ఎక్సయిట్ మెంట్, ఆనందం తట్టుకోలేకపోయాను. వివేక్ ఆత్రేయని గట్టిగా హాగ్ చేసుకున్నా. సినిమా చాలా గొప్పగా వుంది. చాలా అద్భుతంగా తీశారు. నాని నటనాకాశం. అద్భుతమైన సహజనటుడు నాని. రోహిణీ గారి నటన అద్భుతంగా వుంది. ఒక ఎమోషనల్ సీన్ లో స్టవ్ ఆఫ్ చేయాలనే ఆలోచన రావడం రోహిణీ గారి ప్రతిభకు అద్దం పట్టింది. నరేష్ గారికి నేను ఫ్యాన్ ని , ఆయన అద్భుతంగా చేశారు. మై షికావత్ వైఫ్ నజ్రియా. నేను పుష్ప స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినపుడు ఫహద్ గారికి నజ్రియా రికమండ్ చేశారు. సుకుమార్ గారి సినిమా ఎలాగైనా చేయాలని చెప్పారు. నజ్రియా గారికి తెలుగు లో చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. నాని, నజ్రియా నటించినట్లు కనిపించరు. చాలా సహజంగా చేశారు. అమెరికాలో ఓ పెద్దాయన '' నవీన్ గారి లాంటి నిర్మాతా మీ ఇండస్ట్రీలో వుండటం మీ అదృష్టం' అన్నారు. అది నిజమే. వరుస విజయాలు ఇస్తూ ఇండస్ట్రీ బిజినెస్ ని ఒక స్థాయిలో ఉంచుతున్నారు. నవీన్ గారు నిర్మాత గా వుండటం మా అదృష్టం. అలాగే రవి గారి గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. రవి గారి జడ్జ్ మెంట్ బావుంటుంది. మొన్న బన్నీని కలసినప్పుడు ఇదే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన్ని రెండు సార్లు కలిశాను. మొదటిసారి ఆర్య తర్వాత ఆయన్ని కలసినపపుడు సరైన సమాచారం లేక ఆయనికి కథ సరిగ్గా చెప్పలేకపోయాను. అప్పుడు ఆయన కాసేపు మౌనంగా వుండి ''మీరు పెళ్లి చేసుకోండి''అని చెప్పారు. పెళ్లి చెసుకున్నాను( నవ్వుతూ) మొన్న భీమ్లా నాయక్ షూటింగ్ లో ఆయన్ని కలిశా. కూడా త్రివిక్రమ్  గారు కూడా వున్నారు.  నన్ను చూసి త్రివిక్రమ్ గారితో ''సుకుమార్ గారు ఆయాసంగా కనిపిస్తున్నారు. హెల్త్ సరిగ్గా చూసుకోమని'' చెప్పారు. ఆ రోజు నిజంగానే ఆయాసపడ్డాను. అయితే అది అనారోగ్యం వలన కాదు. పవన్ కళ్యాణ్ గారిని చూసిన ఆశ్చర్యంలో ఆయాసపడ్డాను. అంటే సుందరానికీ మీ అందరికీ నచ్చుతుంది. పెద్ద సక్సెస్ అవుతుంది'' అని కోరుకున్నారు


దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ఆవకాయ్ అంటే తెలుగువారందరికీ ఇష్టం. అంటే సుందరానికీ కూడా మంచి ఆవకాయ్ లాంటి సినిమా అవుతుందని అనిపిస్తుంది. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఫ్యామిలీ సినిమాని ఎంజాయ్ చేస్తారని అనిపించింది. నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయ మంచి ఆవకాయ్ ముద్దని కలిపి ప్రేక్షకులకు పెడుతున్నారని అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారికి ఈ సినిమా పెద్ద హిట్ సాధించి పెద్ద పేరు , మంచి డబ్బులు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు


దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అంటే సుందరానికీ సినిమా చూశాను. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ..కడుపుబ్బా నవ్వించి కన్నీళ్లు పెట్టించే సినిమా ఇది. వివేక్ ఆత్రేయ రైటింగ్ అద్భుతంగా వుంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా వుంది. నానికి నరేష్ గారికి మధ్య వచ్చే సీన్స్ చూస్తే మా నాన్నతో నేను మాట్లాడిన మాటలు గుర్తుకువచ్చాయి. ఈ సినిమా చూసిన తర్వాత నాని పేరు మర్చిపోయా. సుందరమే గుర్తున్నాడు. ఒక నటుడికి పాత్ర పేరు గుర్తుపెట్టుకోవడం కంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది. '' తప్పక చూడండి.. నలిగిపోయే పాత్రలో నాని, నజ్రియా.. నలిపేసే పాత్రలలో నదియా నరేష్''  అనాలనిపించింది. (నవ్వుతూ). యూనిట్ అంతా అద్భుతంగా చేశారు. వివేక్ సాగర్ మంచి మ్యూజిక్ చేశారు. మంచి సినిమా ఎక్కడున్నా కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తారు. గెలుపు కోసం పరిగెత్తిన వాడు గెలుపు తర్వాత ఆగిపోతాడు. ధర్మం కోసం నిలబడ్డవాడు ఎన్ని ఆటుపోటులు వచ్చినా అలాగే నిలబడతాడు. గెలుపు శాశ్వతం కాదు ధర్మం మాత్రమే శాశ్వతం. పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం నిలబడే మనిషి. అందుకే ఆయన స్థానం మన గుండెల్లో సుస్థిరం'' అన్నారు. 

దర్శకుడు బుచ్చి బాబు మాట్లాడుతూ..  అంటే సుందరానికి చూశాను. చాలా బావుంది. నాని గారే ఈ సినిమాకి కరెక్ట్ అనిపించింది. నజ్రియా కూడా అద్భుతంగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారు, రవి గారు అంటే దర్శకులకు ఒక హ్యాంగోవర్. వాళ్ళతో పరిచయం మర్చిపోలేం. ఒకసారి వాళ్ళ నిర్మాణంలో సినిమా చేస్తే ఇంక చేస్తూనే వుంటాం. మాది పిఠాపురం. మా ఊర్లో రెండే ఫేమస్. ఒకటి అక్కడే పుట్టిన దత్తాత్రేయ స్వామి. రెండు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.   ఉప్పెన సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మర్చిపోలేను.  అంటే సుందరానికీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నివేదా థామస్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత అందరినీ ఒకే చోట చూడటం ఆనందంగా వుంది. ఇది నా సినిమాలానే అనిపిస్తుంది. బ్రోచేవారెవరురా చేసినప్పుడే నాని- వివేక్ ఆత్రేయ కలసి పని చేయాలని అనుకున్నాను. వివేక్ ఆత్రేయ ఈ జనరేషన్ లో బెస్ట్ డైరెక్టర్.ఇది నాని సినిమా. కానీ నాని కంటే నాకే ఎక్కువ టెన్షన్ గా వుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ వేడుకకి రావడం ఆనందంగా వుంది. మీ అందరూ సినిమాని థియేటర్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ.. నాని గారికి, దర్శకుడు వివేక్ ఆత్రేయకి, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు , రవి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని చాలా మంది మత సంఘర్షణ వున్న సినిమా అనుకుంటున్నారు. ఇది గ్రేట్ హ్యూమన్ ఎమోషన్స్ వున్న సినిమా. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.

గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి : దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భుతమైన సినిమా తీశారు. నాని ఇంకా అద్భుతంగా నటించారు. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. పాటలన్నీ జనాదరణ పొందడం ఆనందంగా వుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు 

రోహిణీ మాట్లాడుతూ... ఈ సినిమా ఒక పండగలా వుంటుంది. మా బాబు నానితో కలసి నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. మా కాంబినేషన్ అంటే 'అలా మొదలైయింది' గురించి మాట్లాడుకుంటారు. ఇకపై 'అంటే సుందరానికీ' గురించి మాట్లాడుకుంటారు. అంతలా ఈ సినిమా అలరిస్తుంది. నజ్రియా ఒక సీమ టపకాయ్. ఆమె ఎక్కడున్నా సందడిగా వుంటుంది. థియేటర్ లోనూ ఆ సందడి చూస్తారు. ఈ చిత్రంలో నేను చేసిన రామా కల్యాణి పాత్ర నేను గర్వపడే పాత్ర. సినిమా చూసిన తర్వాత అది మీరే చెప్తారు. దర్శకుడు వివేక్ ఆత్రేయకి, మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు'' తెలిపారు.


నరేష్ మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్ విజయపరంపరలో మరో విజయం 'అంటే సుందరానికీ'. నాని అద్భుతంగా చేశారు. దర్శకుడు వివేక్ పని రాక్షసుడు. చాలా గొప్ప సినిమా తీశాడు. చిత్ర యూనిట్ అంతటికి శుభాకాంక్షలు. అంటే సుందరానికీ మీ అందరినీ అలరిస్తుంది.

నదియా మాట్లాడుతూ.. అంటే సుందరానికీ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. నాని, నజ్రియా అద్భుతంగా చేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. సినిమా అద్భుతంగా వుంటుంది. మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి'' అన్నారు.

అళగం పెరుమాళ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగా వుంది. దర్శకుడు వివేక్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నాని గారు, నజ్రియా, నరేష్, నదియా అందరికీ కృతజ్ఞతలు. నదియా గారి మొదటి సినిమా నేను కాలేజీ లో వున్నపుడు చూశాను. ఆమెతో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా వుంది. టెక్నికల్ టీం అద్భుతంగా పని చేశారు. చాలా గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నాను.'' అన్నారు

తన్వి రామ్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు సినిమా. ఈ చిత్రంలో అనుభవం గల నటీనటులతో పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాని గారి నటనకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో కలసి పని చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. నజ్రియాతో కలసి పనిచేయడం కూడా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నదియా, నరేష్ గారు ఇలా చాలా మంది సీనియర్ నటులతో నటించడం గొప్ప అనుభవం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. నా మొదటి సినిమాకే పవన్ కళ్యాణ్ గారిని కలసే అవకాశం రావడం ఆయనతో వేదిక పంచుకోవడం ఆనందంగా వుంది'' అన్నారు.

డివోపీ నికేత్ బొమ్మి మాట్లాడుతూ.. దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భతమైన చిత్రాన్ని తీశారు. నాని, నజ్రియా ల కెమిస్ట్రీ లవ్లీగా వుంటుంది. మీరంతా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు'' అన్నారు  

ఎడిటర్ రవితేజ గిరిజాల మాట్లాడుతూ.. దర్శకుడు వివేక్ ఆత్రేయకి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. నాని నజ్రియా గారిని చూడటానికి మూడు గంటలు సరిపోవు. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా వుంది.

డిజైనర్ లతా నాయుడు మాట్లాడుతూ.. అంటే సుందరానికీ నా మనసుకు దగ్గరైన సినిమా. ఒక డ్రీమ్ టీం తో కలసి పని చేశాను. మరోసారి ఈ టీంతో కలసి పనిచేయాలని వుంది'' అన్నారు


Share this article :