Athadu Ame Priyudu Koushal Single Take Dialogue Released

 యండమూరి వీరేంద్రనాధ్

"అతడు ఆమె ప్రియుడు" నుంచి

కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ రిలీజ్!!



బిగ్ బాస్ ఫేమ్ కౌశల్

నట కౌశలంపై ప్రశంసల వర్షం!!


*# 4న ప్రేక్షకుల ముందుకు*


     ప్రఖ్యాత రచయిత 

యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా 

దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”.

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో... రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     బిగ్ బాస్ విన్నర్ కౌశల్  నటించిన "అతడు ఆమె ప్రియుడు" చిత్రం నుండి అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను 02.02.22.మధ్యాహ్నం.02గం.02.నిమిషాలకు చిత్ర దర్శకులు  యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే... ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని ఈసందర్భంగా యండమూరి పేర్కొన్నారు.

     ఈనెల 4న విడుదలవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా & కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!

Post a Comment

Previous Post Next Post