Raj Dasireddy Hello Hollywood

 "హలో హాలీవుడ్" అంటున్న

తెలుగుతేజం "రాజ్ దాసిరెడ్డి"



ప్రియతమ ప్రధాని నరేంద్రమోడి

నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

అందుకున్న రాజ్ దాసిరెడ్డి!!


     ఇంజినీరింగ్ టాపర్ గా నిలిచి, 'న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి'లో శిక్షణ పొంది... సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొంది, మంచి విజయం సాధించిన "భద్రం బికేర్ ఫుల్ బ్రదర్" చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. 

     ఇటీవల సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందంటున్న రాజ్ దాసిరెడ్డి... మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నాడు ముఖ్యంగా నేడు జన్మదినం జరుపుకుంటున్న రాజ్... మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అంటున్నాడు. ఈ తెలుగు తేజం హాలీవుడ్ లోనూ  విజయకేతనం ఎగురవేయాలని కోరుకుందాం!!!!

Post a Comment

Previous Post Next Post