Home » » 2nd song "Bagundi Ee Kaalame" from ''Dear Megha'' is released

2nd song "Bagundi Ee Kaalame" from ''Dear Megha'' is released

 ''డియర్ మేఘ'' చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్

సాంగ్ రిలీజ్




మ్యూజికల్ హిట్ దిశగా ''డియర్ మేఘ'' అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని

పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల

'ఆమని ఉంటే పక్కన' పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా...తాజాగా

సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్ సాంగ్ ను రిలీజ్

చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా

సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే

మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. 'బాగుంది ఈ

కాలమే' పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.


ఊరికే ఇంత కాలం ఉంటున్నా...ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద

వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా...ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే

పోయెనా, వేదనే తీరెనా...బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్

లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను

రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.


''డియర్ మేఘ'' చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో

హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ  సినిమాను

రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్'

పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ''డియర్ మేఘ'' చిత్రం అతి త్వరలో

థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ -

ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ - నాగ

మధు, పీఆర్వో - జీఎస్కే మీడియా. నిర్మాత - అర్జున్ దాస్యన్, రచన,

దర్శకత్వం : సుశాంత్ రెడ్డి



Share this article :