Home » » Tremendous Response for Aha 11th Hour

Tremendous Response for Aha 11th Hour




 `ఆహా`లో ప్ర‌సార‌మ‌వుతున్న ఎమోష‌న‌ల్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది:  త‌మ‌న్నా 


మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రధారిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న  తెలుగు ఓటీటీ ఆహా.. వారి ప్రియమైన తెలుగు ప్రేక్ష‌కులకు ఉగాది సంబరాలను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుగానే తీసుకొచ్చింది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్  ‘లెవన్త్ అవర్’ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...


మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాట్లాడుతూ ``నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాల్లో న‌టించాను. సినిమాల్లో డైరెక్ట‌ర్ ఆలోచ‌నా శైలి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. కానీ.. వెబ్ సిరీస్‌ల విష‌యానికి వ‌స్తే రైట‌ర్స్‌, యాక్ట‌ర్స్ శైలి కనిపిస్తుంది. సినిమాల్లో క‌ట్ టు క‌ట్ చ‌క చ‌కా ఉంటుంది. లెవ‌న్త్ అవ‌ర్ విష‌యానికి వ‌చ్చేస‌రికి త్వ‌ర‌త్వ‌ర‌గా చేసేయాల‌ని కాకుండా కాస్త రియ‌ల్ టైమ్ పెర్ఫామెన్స్‌కు ద‌గ్గ‌ర చేయ‌గ‌లిగాను. లెవ‌న్త్ అవ‌ర్‌లోని అర‌త్రికా రెడ్డి స‌మాజంలోని చాలా మంది మ‌హిళ‌ల‌కు రెఫ‌రెన్స్ అనొచ్చు. ఇందులో ఆమెతో ఉన్న మ‌గ‌వాళ్లు ఎవ‌రూ ఆమె జీవితంలో పోరాటం చేస్తుంద‌ని న‌మ్మ‌రు. ఇలాంటి ఓ పాత్ర‌ను ఇచ్చినందుకు నిర్మాత ప్ర‌దీప్‌గారికి, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారుగారికి, అల్లు అర‌వింద్‌గారికి థాంక్స్‌. తెలుగు కంటెంట్ రోజు రోజుకీ బెట‌ర్ అవుతుంది. ఇత‌ర ఇండ‌స్ట్రీలు కూడా తెలుగు కంటెంట్‌ను అలా వ‌ర్క్ చేయాల‌ని అనుకుంటున్నారు. అలాంటప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోని మ‌న‌పై ఓ బాధ్య‌త ఉంది. ఆహా వంటి చానెల్ ద్వారా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయ‌గ‌లుగుతున్నాం.  ఫీచ‌ర్ ఫిలింలో చూపించ‌లేని ఓ యాక్టింగ్‌ స్పేస్‌ను ఓటీటీలో చూపించ‌వ‌చ్చు. వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తాను. ఇది వ‌ర‌కు త‌మిళంలోనూ ఓ వెబ్ షో చేశాను. అయితే స్క్రిప్ట్ న‌చ్చాలి. మంచి పాత్ర ద‌క్కాలి. వెబ్ సిరీస్ అనేది రైట‌ర్స్‌, యాక్ట‌ర్స్ మీడియం. స్క్రిప్ట్‌, పాత్ర ఆస‌క్తిక‌రంగా లేక‌పోతే ఎవ‌రూ చూడ‌లేరు. లెవ‌న్త్ అవ‌ర్ స్క్రిప్ట్ చ‌ద‌వ‌గానే .. బాగా న‌చ్చ‌డంతో చేయాల‌నిపించింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యాక్ట‌ర్స్ అంద‌రూ ఓటీటీ మీడియంలోకి ఎక్స్‌ప్లోర్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. భ‌విష్య‌త్తులో అంద‌రికీ మంచి అవ‌కాశాలు వ‌స్తాయి. ప్ర‌తిరోజూ నా లైఫ్‌లో లెవ‌న్త్ అవ‌ర్ అనే చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ చేస్తున్న‌ప్పుడు ఓ షెడ్యూల్ తర్వాత క‌రోనా వ‌చ్చింది. దాంతో మూడు వారాల గ్యాప్ వ‌చ్చింది. కానీ ప్ర‌వీణ్‌గారు అండ్ టీమ్ స‌పోర్ట్‌తో అనుకున్న స‌మ‌యం కంటే పూర్తి చేయ‌గ‌లిగాను. ఈ సంద‌ర్భ‌గా ప్ర‌వీణ్‌గారికి, ప్ర‌దీప్‌గారికి, ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది‌`` అన్నారు.  


అదిత్ అరుణ్ మాట్లాడుతూ ``నేను తెలుగులో చేస్తున్న రెండో వెబ్ సిరీస్‌. నా స్నేహితుడు ఒక‌రు ఫోన్ చేసి ఈ వెబ్ సిరీస్‌లో ఓ రోల్ కోసం న‌న్ను రెకమెండ్ చేయ‌మ‌ని చెబితే నేను కో డైరెక్ట‌ర్‌కి ఫోన్ చేశాను. కానీ అప్ప‌టికే ప్ర‌వీణ్‌గారు నన్ను ఆ పాత్ర‌కు ఫిక్స్ చేసుకున్నార‌ని కో డైరెక్ట‌ర్ చెప్పాడు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చాను. ముందు ప్ర‌దీప్‌గారు ఆరు ఎపిసోడ్స్ రాసుకున్నారు. దాన్ని నాకు ఇచ్చారు. నాకు బాగా నచ్చింది. త‌మ‌న్నా చాలా క‌ష్ట‌ప‌డింది. ఇన్‌స్పైరింగ్ ప‌ర్స‌నాలిటీ. ప్ర‌వీణ్ సత్తారు ప‌క్కా ప్లానింగ్ చేయ‌డం వ‌ల్ల 42 రోజుల్లో పూర్తి చేయాల‌నుకున్న షూట్‌ను 33 రోజుల్లో పూర్తి చేశాం`` అన్నారు. 


ఈ కార్య‌క్ర‌మంలో విక్ర‌మాదిత్య కూడా పాల్గొన్నారు.


Share this article :