అభిమానుల సందడి మధ్య 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ రిలీజ్
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం అభిమానుల సందడి మధ్య జరిగింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు రెండు తెలుగు రాష్ట్రల్లోని ప్రధాన సెంటర్ల థియేటర్లలో "వకీల్ సాబ్" సినిమా ట్రైలర్ విడుదల జరిగింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు ఇతర సినిమా యూనిట్ పాల్గొన్నారు.
అభిమానుల చేతుల మీదుగా వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల జరిగింది. బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్ చూసి అభిమానులు హోరెత్తిపోయారు. ఈ సందర్భంగా
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..వకీల్ సాబ్ ట్రైలర్ సూపర్బ్ గా ఉంది కదా. ఈ అరుపులు లేక మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం. ట్రైలర్ చూశారు..మీ అభిమానులంతా హ్యాపీనా. ఇలాంటి సంతోషం కోసం, పవర్ స్టార్ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మూడేళ్లు మనమంతా వేచి చూశాం. ఆ వెయిటింగ్ ఇప్పటికి పూర్తయింది. ఏప్రిల్ 9న ఇదే థియేటర్ లో లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం. అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ*...జై పవర్ స్టార్. ట్రైలర్ బాగుందా. ట్రైలర్ బాగుంది కదా...సినిమా దీని కంటే చాలా చాలా బాగుంటుంది. ట్రైలర్ ను ఎంజాయ్ చేసినట్లే సినిమాను ఆస్వాదిస్తారు. ఏప్రిల్ 9న తేదీకి రెడీ అవ్వండి. అన్నారు.