ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటా - యువ నిర్మాత మోనీష్ పత్తిపాటి
ఈతరం ఫిలింస్ బ్యానర్ లో పలు సామాజిక చిత్రాలను నిర్మించిన నిర్మాత పోకూరి బాబూరావు మనవడు, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తమ్ముడి కొడుకు మోనీష్ పత్తిపాటి నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఎంపీ ఆర్ట్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా కథ కంచికి మనం ఇంటికి అనే సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా
నిర్మాత మోనీష్ పత్తిపాటి మాట్లాడుతూ....నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. మా తాతగారు పోకూరి బాబూరావు గారు, మా పెదనాన్న భీమనేని శ్రీనివాస రావు గార్లు తీసే సినిమాలు చూస్తూ పెరిగాను. మా పెదనాన్న వెంట సినిమా షూటింగులకు వెళ్లేవాడిని. అప్పుడే నేను సినిమా తీయలనే కల మొదలైంది. కానీ సినిమా చేయాలంటే ఒక పొజిషన్ కి రావాలని అనుకొని స్టడీస్ పూర్తి చేసి సొంతంగా నేను సాఫ్ట్ వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా తీయాలను కొని కొన్ని కథలు వినే క్రమంలో కొరియోగ్రాఫర్ చాణక్య నాకు ఈ కథ చెప్పారు. తను చెప్పిన కథ నచ్చడంతో ఎంపీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి కథ కంచికి మనం ఇంటికి అనే సినిమా నిర్మించాను. అలా కొరియోగ్రాఫర్ చాణక్య ఈ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. మా తాతకు, పెద నాన్నకు ఫస్ట్ సినిమా తీస్తున్నట్టు తెలియదు. సినిమా పూర్తి అయిన తర్వాత సినిమా చేశానని వాళ్ళకి చెప్పాను. వారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
సినిమా మొత్తం హారర్ కామెడీ తో నడుస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలకు కథ చెప్పినప్పుడు చివరికి కథ కంచికి మనం ఇంటికి అని అంటారు. కథకు తగ్గట్లే ఉన్న ఈ టైటిల్ అయితే బాగుంటుందని కన్ఫర్మ్ చేశాం. దర్శకుడు నాకు మంచి ఫ్రెండు షూటింగ్ లొకేషన్ కి వెళ్లి ఆయన సినిమా చేసే పద్ధతి చూశాను. తన ప్రతిభ నాకు నచ్చింది. ఈ సినిమాకు తెలుగు అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని పూజిత పొన్నాడను ఆడిషన్ చేసి తీసుకున్నాం.
హీరో, హీరోయిన్ లతో పాటు హేమంత్ , గెటప్ శ్రీను ఇద్దరూ మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటివరకు చాలా హర్రర్ సినిమాలు వచ్చినా ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాము. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మా బ్యానర్ లొనే ప్రొడక్షన్ నెంబర్ 2 గా కుమార్ కోటతో ఒక మూవీ చేస్తున్నాము. ఉగాదికి పూర్తి వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.
నటీనటులు
అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- యమ్. పి.ఆర్ట్స్
టైటిల్ :- కథ కంచికి మనం ఇంటికి
నిర్మాత :- మోనిష్ పత్తిపాడు
దర్శకత్వం :- చాణిక్య చిన్న
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- సుభాష్ డేవాబ్తిని
లైన్ ప్రొడ్యూసర్ :- కుమార్ కోట
మ్యూజిక్ :- బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి :- వైయస్ కృష్ణ
ఎడిటింగ్ :- ప్రవీణ్ పూడి
డైలాగ్స్ :- శ్రీనివాస్ తేజ
ఫైట్స్ :- షావోలిన్ మల్లేష్
వి.యఫ్ యక్స్ :- దుర్గా ప్రసాద్ కేథ, ఆనంద్ పల్లకి
పి.ఆర్.ఓ :- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్