స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్. రత్నంగారి చేతుల మీదుగా.. త్రిభాషా చిత్రం ''ఎవిడెన్స్'' ట్రైలర్ విడుదల
దేదీప్య మూవీస్ బ్యానర్ పై... మర్డర్ మిస్టరీ నేపధ్యంలో రూపుదిద్దుకుంటోన్న త్రిభాషా చిత్రం "ఎవిడెన్స్". ఈ మూవీ ట్రైలర్ వేలెంటైన్స్ డే సందర్భంగా.. ఏ.ఎమ్. రత్నం చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ విడుదల అనంతరం నిర్మాత ఏ.ఎమ్.రత్నం మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
డైరెక్టర్ ప్రవీణ్ రామకృష్ణ మాట్లాడుతూ..ఇదొక డిఫ్రెంట్ స్క్రీన్‌ప్లేతో వస్తోన్న సినిమా. ఇంటరాగేషన్ రూమ్‌లో పోలీస్ ఆఫీసర్‌కి, సస్పెక్టెడ్ ఎక్యూజ్‌డ్‌కి మధ్య జరిగే సన్నివేశాలు మరియు రీరికార్డింగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని అన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్. రత్నంగారు, ఎంతో మంచి మనసుతో, ట్రైలర్ రిలీజ్ చేసి.. ట్రైలర్ చాలా బాగుందని మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే మూవీ రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ తెలిపారు.
రోబో గణేష్, మానసా జోషి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ "ఎవిడెన్స్"కి సాంకేతిక నిపుణులుః
బ్యానర్: దేదీప్య మూవీస్,
ఎడిటర్: రతీష్ కుమార్,
సంగీతం: కార్తీక్,
మాటలు, పాటలు: హనుమయ్య బండారు,
నిర్మాతలు: అరవింద్ అచ్చు, ఎమ్.ఎన్ రవీంద్రరావు, డా. కొడ్లడి శెట్టి, రమేష్,
డైరెక్టర్: ప్రవీణ్ రామకృష్ణ.
Post a Comment