I LIKE ROWDIES-RAMGOPALVARMA


రౌడీలనే ఇష్టపడేవాడ్ని: రామ్‌గోపాల్‌వర్మ

 చిన్నతనంలో గాంధీజీ కంటే రౌడీలనే ఇష్టపడేవాడినని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పే దర్శకుడు వర్మ. తొలి చిత్రం శివతోనే సంచలనం సృష్టించారు. తెలుగు సినిమా పయనాన్ని మార్చారు. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఆయన సినిమా అంటే ప్రేక్షకులకు ఎనలేని ఆసక్తి.

వర్మ దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం నాందాండా. శర్వానంద్, అనైక, అంజలి గుప్తా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలైంది. చెన్నైలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో చిత్ర హీరో హీరోయిన్లు శర్వానంద్, అనైక, నృత్య దర్శకురాలు రాధిక, నిర్మాత దేవిశ్రీదేవి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశ్న : నాందాండా చిత్ర కథేంటి?
వర్మ:  క్రిమినల్ బలం, బలహీనతలను అంచనా వేసి వాడిని మట్టి కరిపించే ఒక యువకుడి కథ నాందాండా. ఈ పాత్రలో నటుడు శర్వానంద్ ఒదిగిపోయారు.

ప్రశ్న : మీ చిత్రాలలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి కదా?
వర్మ:  హింసకు పాల్పడే ప్రతి వ్యక్తి వెనుక అందుకు బలమైన కారణాలుంటాయి. అవి ఏమిటని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.

ప్రశ్న : మీకు రౌడీలంటే ఇష్టమా?
వర్మ:  చిన్నతనంలో గాంధీజీకంటే రౌడీలంటేనే ఇష్టపడేవాడిని.

ప్రశ్న : బాలీవుడ్‌లో బిజీగా ఉన్న మీరు కోలీవుడ్ చిత్రం తీయడానికి కారణమేమిటి?
వర్మ:  తమిళ చిత్రం తెరకెక్కించాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అది ఈ నాందాండా చిత్రంతో తీరనుంది.

ప్రశ్న : ఈ చిత్రంతో దర్శకుడంటే (నాందాండా) నేనేరా అని నిరూపించుకుంటారా?
వర్మ: కచ్చితంగా ఇది నా స్టైల్ చిత్రం.

ప్రశ్న : హీరోయిన్ అనైక గురించి చెప్పండి?
వర్మ:  అనైక తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఆమెకిది తొలి చిత్రమే అయినా చాలా బాగా నటించింది.

ప్రశ్న : చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారు?
వర్మ:  అక్టోబర్ తొలివారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.
THANKS TO SAKSHI 
Previous Post Next Post