Gabbarsingh rocking collections in us|Gabbarsingh crossed magadheera

తెలుగుతెరపై 'గబ్బర్ సింగ్' వీరవిహారం చేస్తున్నాడు. మరో వైపున ఓవర్సీస్ మార్కెట్లో సైతం తన హవాని కొనసాగిస్తున్నాడు. బ్లూస్కై సంస్థ ద్వారా అక్కడ విడుదలైన ఈ సినిమా US బాక్సాఫీసు దగ్గర 1 మిలియన్ డాలర్లని వసూలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ రికార్డ్ ని ఒక్క 'మగధీర' మాత్రమే సొంతం చేసుకుంది. ఒక్కప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే US ఓవర్సీస్ మార్కెట్ ని కొల్లగొడతాయనే అభిప్రాయముండేది. 'మగధీర' రాకతో అలాంటి అభిప్రాయాలకి తెరపడింది. తాజాగా 'గబ్బర్ సింగ్' కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాడు. 
        US ఓవర్సీస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్లను సాధించిన ఈ సినిమా 'మగధీర' తరువాత స్థానాన్ని ఆక్రమించిందని చెబుతున్నారు. పోతే ... ఈ సినిమా వరుసబెట్టి రికార్డులని సృష్టిస్తుండటంతో, నిర్మాత బండ్ల గణేష్ ఆనందంతో పొంగిపోతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ పవన్ ప్రమేయమున్న కారణంగానే ఇంతటి విజయాన్ని సాధించిందని భావించిన గణేష్, అతనికి ఓ ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా పవన్ కోసం హైదరాబాద్ - జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 2 కోట్లు ఖరీదు చేసే ఓ ఫ్లాట్ తీసుకున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో షికార్లు చేస్తున్నాయి. 

Post a Comment

Previous Post Next Post