NAGARJUNA LOVESTORY నాగార్జున ‘లవ్‌స్టోరీ’


నాగార్జునకు ప్రేమకథలు కొత్త కాదు. ప్రేమకు సంబంధించి అన్ని వైవిధ్యమైన అంశాలతోనూ ఆయన సినిమాలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన తన పంథా మార్చి యాక్షన్, ఫ్యామిలీడ్రామా, సోషియో ఫాంటసీ, డివోషనల్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న ‘ఢమరుకం’ సోషియో ఫాంటసీ కాగా, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తున్న ‘శిరిడీ సాయి’ పూర్తి స్థాయి ఆధ్యాత్మికం. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు. 

దానికి ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టుగా సమాచారమ్. 2002లో నాగ్‌తో ‘సంతోషం’ వంటి విజయవంతమైన చిత్రం చేసిన దశరథ్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కలయికలో దశాబ్దం తర్వాత ఈ సినిమా రూపొందుతోంది. ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ తర్వాత దశరథ్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో నాగ్ సరసన నయనతార నటించనున్నారు.

‘శ్రీరామరాజ్యం’ తర్వాత నటించకూడదని నిర్ణయించుకుని, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె అంగీకరించిన తొలి చిత్రం ఇదే. నాగార్జునకు ఇష్టుడైన డి.శివప్రసాద్‌రెడ్డి తమ కామాక్షి సంస్థలో ఈ సినిమా నిర్మించ నున్నారు. జూన్ నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి సంగీత చర్చలు జరుగుతున్నాయి. అనిల్ భండారి ఛాయాగ్రాహకుడు.

Post a Comment

Previous Post Next Post