బాలీవుడ్ నటుడు అమితాబ్ ను తీవ్రమైన అనారోగ్య సమస్య సతమతం చేసేస్తోంది. రెండు నెలల క్రితమే అబ్డామినల్ సర్జరీ చేయించుకున్న అమితాబ్, సోమవారం రాత్రి తిరిగి అదే చోట నొప్పిరావడంతో బాధతో విలవిల లాడిపోయినట్టు తెలుస్తోంది. తనకి విపరీతమైన కడుపునొప్పిరావడంతో నడవడానికీ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాననీ ... సీటీ స్కాన్ నిమిత్తం మంగళవారం ఉదయం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి వెళ్లే అవకాశముందని అమితాబ్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. 1982 లో 'కూలీ' చిత్రం షూటింగ్ లో గాయపడిన అమితాబ్, అప్పటినుంచి తరచూ అనారోగ్యంతో నానా ఇబ్బందులు పడుతూనే వున్నారు. ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఆయన పలు మార్లు ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు. అయితే రీసెంట్ గా చేయించుకున్న సర్జరీ ద్వారా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొత్త సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఈ విషయం అమితాబ్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. | ||||
Post a Comment