చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. ఏ స్టేజ్‌మీదైనా సరే.. తాను అనుకున్నది నిర్మొహమాటంగా మాట్లాడే మోహన్‌బాబు... ANRను సరదాగా ఆటపట్టించారు. టాలీవుడ్‌లో NTR తర్వాత ఆ స్థాయిలో డైలాగ్‌లు చెప్పేది తానొక్కడినేనని.. సాక్షాత్తూ ANR సతీమణే ఒప్పుకున్నారని కాస్త గర్వంగా అన్నారు.
మోహన్‌బాబు తర్వాత మైకందుకున్న చిరంజీవి దీనికి.. తనదైన స్టైల్లో సుతిమెత్తగానే కౌంటర్ వేశారు. బిడ్డ గొప్పదాన్ని తల్లి పొగిడినంత మాత్రాన.. తామేదో గొప్పవాళ్లమైపోయినట్టు చెప్పుకోవడం సరికాదని అన్నారు. ANR మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకుని మరీ చిరంజీవి.. మోహన్‌బాబుకు కౌంటర్ ఇవ్వడం విశేషం.
చిరంజీవి పంచ్‌కి మోహన్‌బాబు కౌంటర్ ఇస్తారని అంతా అనుకున్నా.. ANR అవార్డ్ ఫంక్షన్ కాస్తా పక్కదారి పట్టకుండా సంయమనం పాటించారు. ఈ మాటకుమాట అంతా.. చిరునవ్వుల మధ్యే సాగినా.. అంతర్లీనంగా ఇద్దరి మధ్యా ఉన్న మనస్పర్థల్ని మరోమారు బయటపెట్టింది.
source tv5
Post a Comment