pawankalyan sings song in gabbarsingh

image
పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ఆయన తాజాగా ఓ పాట పాడినట్టు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గబ్బర్ సింగ్' సినిమా కోసం జోష్ తో కూడిన ఓ పాటను పవన్ కల్యాణ్ పాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ వాయిస్ ఈ ట్యూన్ కి బాగా సూట్ అవుతుందని చెప్పి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పట్టుబట్టి మరీ పవన్ చేత ఈ పాట పాడించాడట. ఈ పాటను ఇటీవలే హైదరాబాదులో పోలీస్ స్టేషన్ సెట్లో పవన్, శృతి హాసన్ తదితరులపై చిత్రీకరించినట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా పవన్ కల్యాణ్ కొన్ని సినిమాలలో తన గాత్రాన్ని వినిపించిన సంగతి మనకు తెలిసిందే. మరింకేం.... అభిమానులకు ఇక పండగే!

Post a Comment

Previous Post Next Post