అక్కినేని నాగేశ్వరరావు నటజీవితం 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా సన్మానించారు. శిల్పకళావేదికలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడు తరాల నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన పలువురు వక్తలు అక్కినేనికి భారతరత్న అవార్డు రావాలని ఆకాంక్షించారు. అక్కినేని నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రభుత్వ అవార్డులు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలీదన్నారు. అవార్డులు వచ్చినప్పుడు సంతోషించడమే గానీ, పలానా అవార్డు రావాలని తాను కోరుకోనన్నారు. తాను నూరేళ్లు జీవించాలని కోరుకోవద్దని, జీవించినంత కాలం సంతోషంగా ఉండాలని కోరుకోండని అన్నారు.
అక్కినేని 75 ఏళ్ల నట వసంతం
telugucinemas
0
Tags
General News
Post a Comment