తెలుగు సినిమా కి పైరసీ శాపం గా మారింది రిలీజ్ అయిన ప్రతి సినిమా టోరెంటుల పుణ్యమా అని ఇంట్లో ఫ్రీగా చూసేవారికి టాలీవుడ్ ఇండస్ట్రీ చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. పైరసీ లో ఇంటర్నెట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది ఈ ఇంటర్నెట్ పైరసీ రాష్ట్రం వెలుపల, ఇంకా చెప్పాలంటే దేశం వెలుపల జరుగుతోంది. దాన్ని అరికట్టడం టాలీవుడ్ తరం కాదు. అందుకే అంతర్జాతీయంగా ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇంటర్నెట్ సినిమా పైరసీ ఇప్పుడు పెద్ద సమస్య. అందుకే హాలీవుడ్ స్టూడియోలు పైరసీ ని వేటాడే పని పడుతున్నాయి. అందులో భాగంగా వివిధ దేశాల్లోని ప్రధాన సినిమా పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా వారు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ది మోషన్ పిక్చర్స్ అసోషియేషన్ ఆఫ్ అమెరికా, అసోసియేషన్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ మేజర్ స్టూడియోస్ సంయుక్తంగా టాలీవుడ్ తో ఎంవోయు కుదుర్చుకుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ తెలుగు సినిమా ఇంటర్నెట్ లో అప్లోడ్ అయినా దానిపై చర్యలు తీసుకోవడం సులువవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ ఒప్పందంపై డి.సురేష్ బాబు సంతకం చేశారు. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తంచేశారు. పైరసీని అరికట్టడం ప్రభుత్వం వల్ల మాత్రమే కాదని, ఇలాంటి చర్యలు అవసరం అని అన్నారు.
అయితే, మొత్తం తెలుగు సినిమా గత ఏడాది ఇంటర్నెట్ పైరసీ వల్ల సుమారు 350 కోట్ల రూపాయలు నష్టపోయింది. ప్రతి సంవత్సరం ఈ పైరసీ బెడద అరవై ఐదు శాతం పెరుగుతోంది. దీన్ని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అని డి.సురేష్ బాబు ఈ విషయం లో తెలుగు పరిశ్రమ ఒక్కటిగా వుంది పోరాడాలి తెలుగుసినిమా బతకాలి అంటే పైరసీ చావాలి అని అందరు అంటున్నారు ఈ ప్రయత్నం ఫలించాలి అని కోరుకుందాం
Post a Comment