Thamanna as ganga రాంబాబు తో తమన్నా


కెమెరామెన్ గంగ ఎవరో తెలిసిపోయింది.  కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ వీడిపోయింది.  పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాపై టైటిల్ అర్థం పై క్లారిటీ వచ్చింది.  గంగ రోల్ ఆడో, మగో.. అలీయో, పూరీయో లేక హీరోయినో అని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ పూరీ నిజాన్ని రివీల్ చేశాడు. ఇందులో హీరోయిన్ రోల్ పేరు గంగ అని, ఆ పాత్ర తమన్నా చేయబోతోందనేది తాజా వార్త. కొన్ని రోజుల కిందట ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ చేస్తుందని కూడా అన్నారు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు కాజల్ స్థానంలో తమన్నా వచ్చేసింది. అలాగే ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా కృతికర్చందా చేస్తోంది.  కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీకి ఈమె తో సత్సంబంధాలు నడుస్తున్నాయి. సుమంత్ సినిమా “బోణి”తో కెరీర్ లో  బోణి చేసిన ఈ అమ్మాయి పవన్ తో ఇది వరకే తీన్ మార్ లో నటించింది. 

Post a Comment

Previous Post Next Post