Lovely hero AADI new movie started



తొలి చిత్రం 'ప్రేమ కావాలి' తోనే విజయాన్నిసాధించిన ఆది, 'లవ్లీ' చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆది హీరోగా శ్రీ సౌదామిని క్రియేషన్స్ వారు ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. డ్యాన్సుల్లోనూ ... ఫైట్స్ లోను ... ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనూ యూత్ ని ఆకట్టుకున్న ఆదికి, ఈ సినిమా మరింత ఇమేజ్ పెంచేది అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
గతంలో సౌదామిని క్రియేషన్స్ 'సుందరకాండ' ... 'కొండపల్లి రాజా' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించింది. తాజాగా ఈ బ్యానర్ నిర్మిస్తోన్న సినిమాకి అశోక్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 'పిల్ల జమీందారు' వంటి చిన్న సినిమాతో పెద్దవిజయాన్ని సాధించిన అశోక్, తనదైన స్టైల్లో ఈ సినిమాని తెర కెక్కించనున్నారు. ఇక 'పూలరంగడు' ... 'ఇష్క్' ... 'లవ్లీ' వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా సక్సెస్ చూసిన అనూప్ రూబెన్స్, ఈ సినిమాకి తనదైన శైలిలో బాణీలను అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.

Post a Comment

Previous Post Next Post