Home » , » Srikanth new movie starts on april6th

Srikanth new movie starts on april6th


శ్రీకాంత్ హీరోగా త్వరలో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్రారంభం కాబోతోంది. వి.ఎస్. రామిరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఏప్రిల్ 6 వ తేదీన ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ రాజకీయనేత వై.వి.సుబ్బారెడ్డి తో కెమెరా స్విచాన్ చేయిస్తారానీ, తొలిషాట్ కి వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి సినీ - రాజకీయ - వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నట్టు చెబుతున్నారు. శ్రీకాంత్ జోడీగా ఆశ నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రముఖ తమిళ నటుడు రఘు ... గిరిబాబు ... బ్రహ్మానందం ... జాకీ ... రఘుబాబు తదితరులు నటించనున్నారు. యువ కథానాయకుల పోటీని తట్టుకుంటూ శ్రీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ , అవి ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాయనే విషయం వేచి చూడాలి


Share this article :